Congress Party: లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా హస్తం పార్టీ అడుగులు.. మరో 4 గ్యారెంటీల అమలు ఎప్పుడంటే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి పార్టీ రాజకీయ సమావేశాన్ని గాంధీభవన్‎లో ఏర్పాటు చేశారు. ఏఐసీసీ ఇంచార్జ్ థాక్రె అధ్యక్షతన జరిగిన సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, పీఏసి సభ్యులు హాజరయ్యారు.

Congress Party: లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా హస్తం పార్టీ అడుగులు.. మరో 4 గ్యారెంటీల అమలు ఎప్పుడంటే..
Cm Revanth Reddy
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Srikar T

Updated on: Dec 18, 2023 | 8:25 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి పార్టీ రాజకీయ సమావేశాన్ని గాంధీభవన్‎లో ఏర్పాటు చేశారు. ఏఐసీసీ ఇంచార్జ్ థాక్రె అధ్యక్షతన జరిగిన సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, పీఏసి సభ్యులు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా జరిగిన సమావేశంలో తెలంగాణ నుండి సోనియా గాంధీ లోక్ సభ‎కి పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం మనకు తెలిసిందే. దీంతో పాటు లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మంత్రిని నియమిస్తూ పీఏసీ నిర్ణయం తీసుకుంది.

లోక్ సభ ఇంచార్జ్‎లు వీళ్లే..

పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి చేవెళ్ల నియోజకవర్గం అప్పగించగా.. మహబూబ్‎నగర్ పార్లమెంట్‎కి ఇంచార్జ్‎గా భట్టి విక్రమార్కను నియమించారు. అలాగే ఆదిలాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇంచార్జ్‎గా బాధ్యతలు అప్పగించారు. నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించగా.. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కరీంనగర్‎లో పొన్నం ప్రభాకర్, మహబూబాబాద్‎లో సీతక్క, వరంగల్ నుంచి కొండా సురేఖ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్‎లుగా ఖరారు చేశారు. జహీరాబాద్ దామోదర రాజనర్సింహను ఇంచార్జ్‎లుగా నియమించారు. సంక్రాతి పండుగ తరువాత పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు కోసం జిల్లాకు ఒక మంత్రిని ఇంచార్జ్‎గా వేయనున్నారు. నామినేటెడ్ పోస్టులను నెలలోపు భర్తీ చేస్తామని నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ పదవులపై అధిష్టానం చూసుకుంటుందని ప్రతి కార్యకర్తకు సంక్షేమ పథకాలు లబ్ది జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

4 గ్యారెంటీల అమలు అప్పుడే..

ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుండడంతో పాటు ఆరోగ్య శ్రీ కింద పరిమితిని 10 లక్షల వరకు పెంచుతూ చికిత్స అందిస్తున్నారు. అయితే మిగిలిన అన్ని పథకాలు ఎప్పటి నుండి అమలు చేయాలన్న దానిపై తేదీలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారని షబ్బీర్ అలీ తెలిపారు. వీటితో పాటు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి, సాగు నీటి ప్రాజెక్ట్‎లు, విద్యుత్‎పై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేయడంతో పాటు ఆరు గ్యారంటీ స్కీమ్స్ అప్లికేషన్లు ప్రారంభించనున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‎పూర్‎లో ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లకు మహేష్ కుమార్ గౌడ్‎ని ఇంచార్జ్ గా వేశారు. ఇక్కడి నుండి 50 వేల మంది సభలో పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..