Gram Panchayat Funds: ఈ గ్రామాల్లో అప్పులు చేసి అభివృద్ది పనులు.. నిధుల కోసం సర్పంచ్ల ఆందోళనలు
మరో నెలలో సర్పంచ్ల పదవీకాలం ముగియనుంది. గ్రామ పంచాయితీలో బిల్లులు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లుల కారణంగా.. సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. గత 18 నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో.. అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పలువురు సర్పంచ్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
మరో నెలలో సర్పంచ్ల పదవీకాలం ముగియనుంది. గ్రామ పంచాయితీలో బిల్లులు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లుల కారణంగా.. సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. గత 18 నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో.. అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పలువురు సర్పంచ్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా.. మరో నెలలో సర్పంచ్ల పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు లోకల్ నాయకులు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. గ్రామ పంచాయతీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. స్థానికంగా నిధులు లేనప్పటికీ.. సర్పంచ్లు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. 18 నెలల నుంచి.. నిధులు రావడం లేదు. దీంతో కనీసం సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు. ఒకవేళ నిధులు విడుదలైనప్పటికీ.. విద్యుత్ బిల్లుల కోసం వినియోగిస్తున్నారు. గతంలో అప్పుల బాధ భరించలేక.. కొందరు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అంతేకాదు.. పదవి నుంచి తప్పుకున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సర్పంచుల పదవీకాలం జనవరి 31తో ముగుస్తుంది. అయినప్పటికీ బిల్లులు మంజూరు గురించి ప్రభుత్వం నుంచి ఎంలాటి సమాధానం లేదు. తాము అప్పులు తెచ్చి అభివృద్ధి చేశామని నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
మేడిపల్లి మండలం గోవిందరం సర్పంచ్ మధుకర్ సుమారుగా 18 లక్షల వరకు అప్పు చేసినట్లు చెబుతున్నారు. ఆ అప్పు చేసిన ధనాన్ని అభివృద్ధి పనుల కోసం వెచ్చించామంటున్నారు. కానీ నిధులు మంజూరు చేయలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదలకు సంబంధిత అధికారులు చుట్టు తిరిగినా లాభం లేదని.. నిధులు మాత్రం మంజూరు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు.
అదే విధంగా సైదాపూర్ మండలం ఆకునూరు సర్పంచ్ రమణారెడ్డి సుమారుగా 49 లక్షలతో పలు అభివృద్ది పనులు చేశానంటున్నారు. ఆయనకు కూడా నిధులు మంజూరు చేయలేదని వాపోతున్నారు. చాలా గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయకున్నా.. సొంత డబ్బులు పెట్టుకొని పనులు చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. నూతన ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
నిధులు మంజూరు కాకపోవడంతో.. ఆర్థికంగా చితికిపోతున్నామని సర్పంచ్లు తమ గోడును వినిపిస్తున్నారు. లక్షల రూపాయాలు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. వెంటనే ఇప్పటి వరకూ ఉన్న పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..