‘మాయమై పోతున్నడన్న మనిషన్న వాడు’.. అప్పు చెల్లించలేదని ఏం చేశారంటే..
వివరాల్లోకి వెళితే.. తాము ఇచ్చిన అప్పు తిరిగి తీర్చకుండా తప్పించుకున్న ఓ వ్యక్తి ని రుణదాతలు చావు దగ్గర పట్టుకున్నారు. చేసిన అప్పులు చెల్లించకుండా కొన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు.. చాలా రోజుల నుంచి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు.. కానీ దొరకలేదు.. తండ్రి చనిపోవడంతో అక్కడికి చేరుకున్న వ్యక్తి నిలదీశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్ణణానికి చెందిన పుల్లూరి శ్రీకాంత్ అనే వ్యక్తికి..

సమాజంలో రోజురోజుకీ మనావతా విలువలు తగ్గిపోతున్నాయి. సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే.. అందెశ్రీ అన్నట్లు ‘మాయమై పోతున్నడన్న మనిషన్న వాడు’ అన్న పాట అక్షరాల నిజమనిపిస్తోంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జరిగిన ఓ సంఘటన సమాజంలో తగ్గిపోతున్న విలువలకు నిదర్శంగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. తాము ఇచ్చిన అప్పు తిరిగి తీర్చకుండా తప్పించుకున్న ఓ వ్యక్తి ని రుణదాతలు చావు దగ్గర పట్టుకున్నారు. చేసిన అప్పులు చెల్లించకుండా కొన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు.. చాలా రోజుల నుంచి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు.. కానీ దొరకలేదు.. తండ్రి చనిపోవడంతో అక్కడికి చేరుకున్న వ్యక్తి నిలదీశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్ణణానికి చెందిన పుల్లూరి శ్రీకాంత్ అనే వ్యక్తికి పట్టణానికి చెందిన కొంతమంది అప్పులు ఇచ్చారు.
అయితే తమ డబ్బులు తమకు ఇవ్వాలంటే తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో రుణదాతలు అవకాశం చూస్తున్న క్రమంలో శ్రీకాంత్ తండ్రి ఆదివారం మరణించాడు. తండ్రి అంత్యక్రియల కోసం మెట్ పల్లికి వచ్చిన అతన్ని పట్టుకుని తమ అప్పుల మాటేమిటని నిలదీశారు. చివరకు మరో వాయిదా పెట్టిన శ్రీకాంత్ అప్పులు ఇచ్చిన వారికి మరో అగ్రిమెంట్ పేపర్ రాసిచ్చిన తరువాత అంత్యక్రియలకు అనుమతించారు.
అయితే శ్రీకాంత్‌కు అప్పు ఇచ్చిన వారు మాట్లాడుతూ… గతంలో కూడా అతన్ని డబ్బులు ఇవ్వాలని అడిగిన ఇవ్వలేదని, హైదరాబాద్ లో, మెట్ పల్లిలో ఆస్థులు కూడబెట్టుకున్నాడని ఆరోపించారు. గతంలో ఓ సారి ఇలాగే వచ్చి వెల్లిపోయాడని ఈ రోజు అతని తండ్రి మరణించడంతో అతనితో అగ్రిమెంట్ రాయించుకోవల్సి వచ్చిందన్నారు. శ్రీకాంత్ కు వచ్చే వాటా ఆస్థిని విక్రయించి అప్పులు చెల్లిస్తానని రాయించిన తరువాత కాని రుణ దాతలు శాంతించలేదు. మెట్ పల్లి పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనను చూసైనా అప్పులు తీసుకుని తప్పించుకుని తిరిగే వారికి తగిన గుణపాఠం రావాలని రుణ దాతలు ఆకాంక్షించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..