AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: న్యూఇయర్ వేళ పబ్స్‌పై పోలీసుల స్పెషల్‌ ఫోకస్.. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం రేవంత్ ఆదేశాలు

హైదరాబాదు మత్తు మాఫియాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. భాగ్యనగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేలా పోలీసులు టార్గెట్ నిర్ధేశించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు అందడంతో మొత్తం మాఫియా ఆట కట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాదులోని పలు పబ్బులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలతో ఓనర్స్‌లలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్ డ్రగ్ ఫెడ్లర్లకు షెల్టర్ జోన్ లాగా..

Hyderabad: న్యూఇయర్ వేళ పబ్స్‌పై పోలీసుల స్పెషల్‌ ఫోకస్.. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం రేవంత్ ఆదేశాలు
Drug Peddlers In Hyderabad
Peddaprolu Jyothi
| Edited By: Srilakshmi C|

Updated on: Dec 18, 2023 | 1:08 PM

Share

హైదరాబాదు, డిసెంబర్‌ 18: హైదరాబాదు మత్తు మాఫియాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. భాగ్యనగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేలా పోలీసులు టార్గెట్ నిర్ధేశించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి కూడా స్పష్టమైన ఆదేశాలు అందడంతో మొత్తం మాఫియా ఆట కట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాదులోని పలు పబ్బులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలతో ఓనర్స్‌లలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్ డ్రగ్ ఫెడ్లర్లకు షెల్టర్ జోన్ లాగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలను నగరానికి తీసుకువచ్చి డ్రగ్ ఫెడ్లర్లు విక్రయానికి పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా నెట్వర్క్‌లను ఏర్పాటు చేసుకుని ఖాకిలా కళ్ళు కప్పి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తమ దందా ను కొనసాగిస్తున్నారు. తాజాగా పోలీస్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ అంశంపై సీరియస్ అయ్యారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

తాజాగా హైదరాబాదులో పబ్బులపై వెస్ట్ జోన్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మొట్టమొదటిసారిగా ఈ తనిఖీలలో స్నిపర్ డాగ్స్ ను వినియోగించారు. స్నిపర్ డాగ్స్ తో పాటు క్లూస్ టీం ను కూడా వెంట తీసుకుని పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉంటుందనే భావన ఉంది. పబ్ ఓనర్స్ నేరుగా డ్రగ్ సప్లై చేస్తున్నట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా పోలీసుల తనిఖీలతో పబ్ యాజమానులలో ఆందోళన మొదలైంది. న్యూ ఇయర్ ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే పబ్ నిర్వాహకులు పలు ఈవెంట్లను ప్లాన్ చేశారు. ఈవెంట్లో డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పబ్ లలో డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై పోలీసులు దృష్టి సారించారు. పబ్ లలో డ్రగ్స్ అమ్మకాలు కొనసాగిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. కేవలం పబ్బులు మాత్రమే కాకుండా సిటీ శివారులో ఉండే ఫార్మ్ హౌస్ లపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు. ఫార్మ్ హౌస్ లలో సైతం సాంఘిక కార్యకలాపాలతో పాటు మత్తు పదార్థాల వినియోగం అధికంగా ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి.

ఇదే కాకుండా డిసెంబర్ 31న పలు పబ్బులు ఏర్పాటు చేసిన ఈవెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు పోలీసులు. గతంలో డ్రగ్స్ సప్లై చేసినట్టు ఆరోపణలు ఉన్న పబ్బుల పై ఈ నిఘా మరింత అధికం చేశారు. నిర్వాహకుల పైన అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ల పైన గతంలో డ్రగ్స్ కి సంబంధించిన కేసులు ఉంటే వారిని హెచ్చరించనున్నారు పోలీసులు. పబ్బులలో ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వినియోగిస్తూ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో పబ్ ఓనర్స్ లో ఆందోళన మొదలైంది. ఖాఖీలా నిఘాతో డిసెంబర్ 31 ఈవెంట్స్ లను సిటీ శివారులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించేందుకు కొంతమంది నిర్వాహకులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాదును మార్చాలి అన్న పోలీసుల ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయో చూడాలి మరీ..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.