Minister Uttam Kumar Reddy: మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై సమావేశం.. వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాలనలో వేగం పెంచింది. తనదైన దూకుడు ప్రదర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. మన్నటి వరకూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ జరిపిన రేవంత్ ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాలనలో వేగం పెంచింది. తనదైన దూకుడు ప్రదర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. మన్నటి వరకూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ జరిపిన రేవంత్ ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక రేవంత్ అండ్ టీం కూడా ఇదే జోష్‌లో తమ పరిపాలనా దక్షతకు పదును పెడుతున్నారు.
మొన్నటి వరకు పౌర సరఫరాశాఖ అధికారులతో సమీక్షలు జరిపిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం నీటి ప్రాజెక్టులు నిర్మించిన ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేపట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్. వి దేశాయ్‌తోపాటు పలువురు సంస్థకు చెందిన ప్రతినిధులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎల్ అండ్ టీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. రాష్ట్రానికి సంబంధించిన అతి పెద్ద నీటి ప్రాజెక్టులో నాసి రకం పనులు ఎలా చేస్తారని, నాణ్యత లేకుండా ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారులకు ఇచ్చి తమ ప్రమేయం ఏమీ లేదని తప్పించుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టమన్నారు.
ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మించిన ఏజెన్సీలనే కాకుండా.. అన్నారం, సిందిళ్ళ ప్రాజెక్టులు నిర్మించిన ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని అధికారులకు ఆదేశించారు. తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కృంగిన విషయం మనకు తెలిసిందే. దీనిని కేంద్ర నుంచి వచ్చిన బృందాలు కూడా పరిశీలించాయి. తాజాగా మంత్రి చేపట్టిన సమావేశంతో ఎలాంటి పురోగతి ఉంటుందో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..