Congress Party: సోనియా గాంధీ ఇక్కడి నుంచే పోటీ చేయాలి.. పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం..
హైదరాబాద్లో ఈరోజు కాంగ్రెస్ ముఖ్యనేతలతో పీఏసీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఇక లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పీఏసీ సమావేశంలో ఇదే అంశంపై కీలకంగా చర్చ జరిగింది. పీఏసీ భేటీలో మూడు అంశాలపై తీర్మానాలు చేశారు కాంగ్రెస్ నేతలు.
హైదరాబాద్లో ఈరోజు కాంగ్రెస్ ముఖ్యనేతలతో పీఏసీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఇక లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. పీఏసీ సమావేశంలో ఇదే అంశంపై కీలకంగా చర్చ జరిగింది. పీఏసీ భేటీలో మూడు అంశాలపై తీర్మానాలు చేశారు కాంగ్రెస్ నేతలు. తమను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ప్రచారం చేసిన ఇతర పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ఆమోదించారు. ఇక తెలంగాణలో సోనియాగాంధీ పోటీ చేయాలని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించింది తెలంగాణ పీఏసీ.
పీఏసీ భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశంపై కూడా చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్.. అసెంబ్లీనే అందుకు వేదికగా చేసుకోనుంది. ఇదే విషయాన్ని పీఏసీ భేటీ అనంతరం ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని.. మిగతా గ్యారంటీలు, మరిన్ని పథకాల అమలు ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి ప్రారంభిస్తామని పీఏసీ సభ్యుడు షబ్బీర్ అలీ తెలిపారు.
ఇంకా కాంగ్రెస్ నేత మహ్మద్ షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ జిల్లా నుంచి పోటీ చేసినట్లు గుర్తు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలన్న తమ అభ్యర్థనను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి సమర్పించాల్సిందిగా పీఏసీ సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు.
Telangana Congress passed unanimous resolution requesting Sonia Gandhi to contest in Lok Sabha elections from Telangana.
Earlier former PM Indira Gandhi contested as MP from Medak Parliament pic.twitter.com/MzwcUg1CMR
— Naveena (@TheNaveena) December 18, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..