Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆదేశం.. సీఎం కాన్వాయ్ కోసం కీలక నిర్ణయం తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి గతానికి భిన్నంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగొద్దని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వాహనాల సంఖ్యను కూడా దాదాపు సగానికి తగ్గించాలని సూచించారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆదేశం.. సీఎం కాన్వాయ్ కోసం కీలక నిర్ణయం తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 18, 2023 | 5:14 PM

CM Revanth Reddy Convoy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి గతానికి భిన్నంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగొద్దని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వాహనాల సంఖ్యను కూడా దాదాపు సగానికి తగ్గించాలని సూచించారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్‌ పోలీసులు కొత్త పద్ధతి పాటిస్తున్నారు. తన కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న సీఎం ఆదేశాలతో పోలీసులు ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ బయల్దేరిన తర్వాత ఐదారు సెకన్ల గ్యాప్‌తోనే పోలీసులు ట్రాఫిక్‌ను వదులుతున్నారు.

జూబ్లీహిల్స్‌లో నివాసముండే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సెక్రటేరియట్‌కు వెళ్లడానికి రోడ్‌ నెంబర్‌ 45 ద్వారా.. బాలకృష్ణ జంక్షన్‌కు, అక్కడ్నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్‌ సర్కిల్‌, టీవీ9 జంక్షన్‌, నాగార్జున సర్కిల్‌, బంజారాహిల్స్‌ తాజ్‌కృష్ణ మీదుగా ఖైరతాబాద్‌ జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి హుస్సేన్‌సాగర్‌ రోడ్‌ నుంచి నేరుగా సెక్రటేరియట్‌లోకి వెళ్తుంది సీఎం కాన్వాయ్‌. అయితే, ప్రతి జంక్షన్‌లోనూ ఐదారు సెకన్లపాటు మాత్రమే ట్రాఫిక్‌ను ఆపుతున్నారు పోలీసులు. సీఎం కాన్వాయ్‌ ఒక జంక్షన్‌ను క్రాస్‌ చేయగానే నార్మల్‌ ట్రాఫిక్‌ను సెకన్ల వ్యవధిలోనే వదిలిపెడుతున్నారు.

వీడియో చూడండి..

జూబ్లీహిల్స్‌ నుంచి గాంధీభవన్‌కు వెళ్లాలంటే… ఖైరతాబాద్‌ జంక్షన్‌ వరకూ ఇదే మార్గంలో సీఎం కాన్వాయ్ వెళ్తుంది. అక్కడ్నుంచి లక్డికపూల్‌, అసెంబ్లీ మీదుగా నాంపల్లి, గాంధీభవన్‌కు చేరుకుంటుంది ముఖ్యమంత్రి కాన్వాయ్‌.. రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ వెళ్లే మార్గాల్లో పోలీసులు పక్కా వ్యూహంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కొత్త మూవింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..