Keedaa Cola OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. ఆహాలో తరుణ్‌ భాస్కర్ రీసెంట్ హిట్.. కీడాకోలా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పలు సినిమాల్లోనూ స్పెషల్‌ రోల్స్‌తో అలరిస్తోన్న తరుణ్‌ భాస్కర్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ మెగా ఫోన్‌ పట్టుకున్నాడు. కీడా కోలా అంటూ ఓ డార్క్‌ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌తో మన ముందుకొచ్చాడు. దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో తరుణ్‌ భాస్కర్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. చైతన్య రావు, మయూర్ రాగ్, జీవన్, బ్రహ్మానందం, జీవన్, రఘురామ్, విష్ణు, రవీంద్ర విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు

Keedaa Cola OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. ఆహాలో తరుణ్‌ భాస్కర్ రీసెంట్ హిట్.. కీడాకోలా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Keedaa Cola Movie
Follow us

|

Updated on: Dec 19, 2023 | 2:59 PM

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్‌ భాస్కర్‌. ఆ తర్వాత ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ హీరోగానూ సత్తా చాటాడు. పలు సినిమాల్లోనూ స్పెషల్‌ రోల్స్‌తో అలరిస్తోన్న తరుణ్‌ భాస్కర్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ మెగా ఫోన్‌ పట్టుకున్నాడు. కీడా కోలా అంటూ ఓ డార్క్‌ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌తో మన ముందుకొచ్చాడు. దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో తరుణ్‌ భాస్కర్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. చైతన్య రావు, మయూర్ రాగ్, జీవన్, బ్రహ్మానందం, జీవన్, రఘురామ్, విష్ణు, రవీంద్ర విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. నవంబర్‌ 3న థియేటర్లలో విడుదలైన కీడా కోలా యావరేజ్‌గా నిలిచింది. సినిమా కాన్సెప్ట్‌ జనాలకు పెద్దగా కనెక్ట్‌ కాలేకపోయింది. అయితే తరుణ్‌ భాస్కర్‌ మార్క్‌ కామెడీ సీన్స్‌, సన్నివేశాలు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని సన్నివేశాలు మీమ్స్‌గా బాగా నెట్టింట బాగా వైరలవుతున్నాయి. థియేటర్లలో అలరించిన కీడా కోలా మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా తరుణ్‌ భాస్కర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. డిసెంబర్‌ 29 నుంచి కీడా కోలా సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు మాత్రం ఒక రోజు ముందుగా అంటే డిసెంబర్ 28నే ఈ కామెడీ థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వస్తుంది.

‘దరిద్రానికి దగ్గరగా.. పైసల్‍కి దూరంగా.. మజాక్‍లో బతుకుతున్న కొన్నిజీ వితాలను సూడడానికి రెడీగా ఉండండి. పక్కా నవ్వుల దాడి కీడాకోలా.. డిసెంబర్ 29న ప్రీమియర్‌కు రానుంది. గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు 24 గంటల ముందే యాక్సెస్‍కు వస్తుంది’ అని కీడా కోలా మూవీ స్ట్రీమింగ్‌ డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది ఆహా. వీజీ సైన్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ సంయుక్తంగా కీడా కోలా సినిమాను నిర్మించారు. వివేక్ సాగర్ స్వరాలు అందించారు. ఏజే ఆరోన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా, ఉపేంద్ర వర్మ ఎడిటర్‌గా వ్యవహరించారు. మరి థియేటర్లలో కీడా కోలా సినిమాను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం