- Telugu News Photo Gallery Cricket photos Ipl 2024 Telugu rcb signings alzarri joseph and yash dayal with rs 16.50 Crores
గతేడాది రూ.5 కోట్లు.. కట్‌చేస్తే.. ఈ ఏడాది రూ.16 కోట్లు.. గుజరాత్ వదిలేసిన పేలవ ప్లేయర్లపై.. ఆర్సీబీ కాసుల వర్షం
IPL 2024, Royal Challengers Bangalore: 2 సార్లు ఫైనల్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ తరపున పేలవ ప్రదర్శన చేసిన అల్జారీ జోసెఫ్, యష్ దయాల్‌లను కొనుగోలు చేసినందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా రూ. 16.50 కోట్లు చెల్లించింది. దీంతో ఈ ప్లేయర్లకు పెట్టిన ఖర్చు చూసి ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Dec 20, 2023 | 12:59 PM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 వేలం ముగిసిన వెంటనే RCB జట్టు గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. దీనికి ప్రధాన కారణం RCB ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన ఆటగాళ్లే. ఎందుకంటే ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టు మాజీ ఆటగాళ్ల కోసం RCB ఎక్కువ మొత్తం ఖర్చు చేసింది.

అంటే ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న అల్జారీ జోసెఫ్, యష్ దయాల్‌లను ఈసారి ఆర్‌సీబీ జట్టు కొనుగోలు చేసింది. అది కూడా కోట్లకు పడగలెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇక్కడ, అల్జారీ జోసెఫ్ కొనుగోలు కోసం RCB ఫ్రాంచైజీ రూ. 11.50 కోట్లు వెచ్చించింది. అలాగే యశ్ దయాల్ రూ.5 కోట్లు చెల్లించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు ఆటగాళ్లకే ఆర్సీబీ రూ.16.50 కోట్లు ఇవ్వడం విశేషం.

ఐపీఎల్ 2022 వేలంలో కేవలం రూ. 2.40 కోట్లకు అల్జారీ జోసెఫ్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.

అలాగే యశ్ దయాల్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఈసారి గుజరాత్ జట్టు దయాల్‌ను రిటైన్ చేయలేదు.

ఎందుకంటే, గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున 14 మ్యాచ్‌లు ఆడిన యశ్ దయాల్ 13 వికెట్లు మాత్రమే తీశాడు. అందుకే ఈసారి అతడిని వదులుకుంది.

మరోవైపు గత 2 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన అల్జారీ జోసెఫ్ 16 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు మాత్రమే తీశాడు. ఆ విధంగా గుజరాత్ ఫ్రాంచైజీ ఈసారి వెస్టిండీస్ పేసర్‌ను జట్టు నుంచి తప్పించింది.

రెండుసార్లు ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ తరపున పేలవ ప్రదర్శన కనబర్చిన అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్‌లను కొనుగోలు చేసినందుకు ఆర్‌సీబీ రూ.16.50 కోట్లు చెల్లించింది. ఈ ఖర్చు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.




