Success Story: సంకల్పమే నడిపించింది.. పెళ్లయినా కూడా కలెక్టరమ్మ అయ్యింది.. స్ఫూర్తినిచ్చే ఐఏఎస్‌ స్టోరీ ఇదే..!

మహిళలకు ఇలా ఏళ్ల తరబడి సిద్ధమయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే వయస్సు మీరే కొద్దీ పెళ్లి అవ్వదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తారు. ఈ నేపథ్యంలో వారి ఆశలన్నీ అడియాశలు అయ్యాయనే బాధ వారిని వేధిస్తుంది. అయితే కొంతమంది తమ ఆశను జీవిత భాగస్వామితో చర్చించి తమ ఆశను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ఓ మహిళ పెళ్లయిన తర్వాత భర్త ప్రోత్సాహంతో ఐఏఎస్‌ అయ్యింది.

Success Story: సంకల్పమే నడిపించింది.. పెళ్లయినా కూడా కలెక్టరమ్మ అయ్యింది.. స్ఫూర్తినిచ్చే ఐఏఎస్‌ స్టోరీ ఇదే..!
Abhilasha Sarma
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Dec 14, 2023 | 1:00 PM

ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా మంది యువత కల. స్థిరమైన ఉద్యోగంతో పాటు ఉద్యోగ భద్రత ఉంటుందని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగ అన్వేషణలో ఉంటారు. ఏళ్ల తరబడి పోటీపరీక్షలకు సిద్ధం అవుతూ ఉంటారు. అయితే మహిళలకు ఇలా ఏళ్ల తరబడి సిద్ధమయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే వయస్సు మీరే కొద్దీ పెళ్లి అవ్వదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తారు. ఈ నేపథ్యంలో వారి ఆశలన్నీ అడియాశలు అయ్యాయనే బాధ వారిని వేధిస్తుంది. అయితే కొంతమంది తమ ఆశను జీవిత భాగస్వామితో చర్చించి తమ ఆశను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ఓ మహిళ పెళ్లయిన తర్వాత భర్త ప్రోత్సాహంతో ఐఏఎస్‌ అయ్యింది. అభిలాష శర్మ హర్యానాలో పుట్టి పెరిగింది. కష్టతరమైన యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో ఆమె ప్రారంభ ప్రయత్నాలలో అపారమైన కష్టాలను ఎదుర్కొంది. పూర్తి పట్టుదల, సంకల్పం ద్వారా మాత్రమే ఆమె తన నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీను క్రాక్‌ చేసింది. అభిలాష శర్మ గురించి మరిన్ని విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

యూపీఎస్సీ అభిలాష మొదటి ప్రయత్నం 2013లో చేసింది. వరుసగా మూడు ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె డైలమాలో పడింది. అయినప్పటికీ తనను తాను ఉత్సాహపరుచుకుంటూ ఆమె ఒక రోజులో 15 నుంచి 16 గంటలు కఠినమైన అధ్యయనాలకు కేటాయించడం ప్రారంభించింది. ఆమె తన ఐచ్ఛిక సబ్జెక్టులుగా అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయ శాస్త్రాన్ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలో తన నాలుగో ప్రయత్నంలో అభిలాష ఆకట్టుకునే ఏఐఆర్‌ 68ని పొందింది. అభిలాషకు 2017లో అంకిత్‌ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అనంతరం తన భర్త ప్రోత్సాహంతో అభిలాష తన ప్రాక్టీస్‌ను కొనసాగించింది.

ఈ విజయాన్ని అభిలాష భర్త అంకిత్‌కు అంకింతం చేసింది. అభిలాష ప్రేమ వివాహం చేసుకుంది. ప్రాక్టీస్‌లో భాగంగా అభిలాష ప్రతిరోజు వార్తాపత్రికలు చదవడం దినచర్యగా మార్చుకుంది. ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యే వాళ్ల కచ్చితంగా కరెంట్ అఫైర్స్‌పై అప్‌డేట్‌గా ఉండాలని అభిలాష సలహా ఇస్తున్నారు. చదువుతున్నప్పుడు సరైన శ్రద్ధ చూపకపోతే అది కూడా అడ్డంకిగా మారవచ్చని పేర్కొంటున్నారు. అలాగే ఆప్టిట్యూడ్‌పై సరైన అవగాహనతో ఉండాలని సూచించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.