APPSC Group-4 Results: ఏపీపీఎస్సీ గ్రూపు-4 మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. డిసెంబర్ 21న ధ్రువపత్రాల పరిశీలన

ఏపీపీఎస్సీ గ్రూపు 4 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ప్రకటన వెలువడింది. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో డిసెంబర్‌ 21న ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. గ్రూప్‌ 4 మెయిన్స్‌ ఫలితాలు బుధవారం (డిసెంబర్‌ 13) విడుదలయ్యాయి. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి..

APPSC Group-4 Results: ఏపీపీఎస్సీ గ్రూపు-4 మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. డిసెంబర్ 21న ధ్రువపత్రాల పరిశీలన
APPSC Group-4 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2023 | 9:39 PM

అమరావతి, డిసెంబర్‌ 13: ఏపీపీఎస్సీ గ్రూపు 4 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ప్రకటన వెలువడింది. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో డిసెంబర్‌ 21న ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. గ్రూప్‌ 4 మెయిన్స్‌ ఫలితాలు బుధవారం (డిసెంబర్‌ 13) విడుదలయ్యాయి. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి బుధవారం (డిసెంబర్‌ 13) ఓ ప్రకటన విడుదల చేశారు.

డిసెంబర్‌ 18, 20 తేదీల్లో ఎయిమ్స్‌ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగ రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డులు విడుదల

దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో మొత్తం 3,036 నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. ప్రధాన పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్‌ 18, 20 తేదీల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ ఎయిమ్స్‌ (సీఆర్‌ఈ- ఎయిమ్స్‌) జరగనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 18 ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లలో మొత్తం 3,036 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఐడీ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలను నమోదు చేసి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టుల్లో అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైటీషియన్, ఆడియోలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్, బయో మెడికల్ ఇంజినీర్, క్యాషియర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

టీఎస్పీయస్సీ గ్రూప్‌-2 రీషెడ్యూలు వచ్చేది ఎప్పుడో..?

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది. సన్నద్ధతకు సమయం కావాలంటూ నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ రీషెడ్యూల్‌ చేసింది. అయితే నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు జరపాలని రీషెడ్యూల్‌ చేశారు. అయితే తాజాగా టీఎస్పీయస్సీ బోర్టును ప్రక్షాలన చేసిన సర్కార్ కొత్త బోర్డు ఏర్పాటు తరువాతే పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో జనవరిలో జరిగే గ్రూప్‌ 2 పరీక్ష మరోమారు రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈమేరకు పరీక్షను రీషెడ్యూల్‌ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తదుపరి నిర్వహణ తేదీలు ఎప్పుడనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.