CM Revanth Reddy: టీఎస్‌పీస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. నియమకాలు, నోటిఫికేషన్లపై కీలక ఆదేశాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

CM Revanth Reddy: టీఎస్‌పీస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. నియమకాలు, నోటిఫికేషన్లపై కీలక ఆదేశాలు
CM Revanth Reddy
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2023 | 6:40 AM

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీస్సీ) ప్రక్షాలనకు సీఎం రేవంత్ రెడ్డి నడుం బిగించారు. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం (డిసెంబర్‌ 12 డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవి గుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీ.ఎస్.పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి  అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీ.కె. శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. టీ.ఎస్.పీ.ఎస్.సి ఛైర్మన్, సభ్యుల నియామకాలకు సుప్రీమ్ కోర్ట్ జారీ చేసిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగు మార్గదర్శకాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు సోమవారం (డిసెంబర్ 11) సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం TSPSC ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బాటలోనే కమిషన్ సభ్యులు తమ పదవులకు మంగళవారం (డిసెంబర్‌ 12) రాజీనామా చేశారు.కమిషన్ ఐదుగురు సభ్యులు బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్, కారం రవీంద్రరెడ్డి, ఆర్ సత్యనారాయణలు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామాల లేఖలను సమర్పించేందుకు గవర్నర్ తమిళిసై అప్పాయింట్ మెంట్ కూడా కోరారు. అయితే ప్రస్తుతం గవర్నర్ పుదుచ్చేరి పర్యటనలో ఉండడంతో బుధవారం (డిసెంబర్‌ 13) రాజీనామా లేఖలను అందజేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పది పరీక్షలపై సమీక్ష..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో