Andhra Pradesh: ఛీ.. వీడు తండ్రేనా? మూడో పెళ్లికి అడ్డొస్తుందనీ కన్న కూతురి పట్ల కౄరత్వం

ఓ కసాయి తండ్రి కన్న కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అతగాడు మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే మూడో పెళ్లికి కూతురు అడ్డుగా ఉందని గ్రహించిన ఆ తండ్రి, కన్న బిడ్డను కూడా మాయం చేసేందుకు వెనకాడలేదు. తల్లితో కలిసి ఐదేళ్ల కూతుర్ని నిత్యం వేదించసాగాడు. చిన్నారికి ఆహారం ఇవ్వకుండా, కనీసం ధరించేందుకు బట్టలు కూడా ఇవ్వకుండా బాత్‌ర్రూంలో బంధించి, చిత్రహింసలకు గురి చేయసాగాడు. ఈ దారుణ సంఘటన..

Andhra Pradesh: ఛీ.. వీడు తండ్రేనా? మూడో పెళ్లికి అడ్డొస్తుందనీ కన్న కూతురి పట్ల కౄరత్వం
Father Harassing Daughter
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2023 | 4:16 PM

జగ్గయ్యపేట, డిసెంబర్‌ 13: ఓ కసాయి తండ్రి కన్న కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అతగాడు మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే మూడో పెళ్లికి కూతురు అడ్డుగా ఉందని గ్రహించిన ఆ తండ్రి, కన్న బిడ్డను కూడా మాయం చేసేందుకు వెనకాడలేదు. తల్లితో కలిసి ఐదేళ్ల కూతుర్ని నిత్యం వేదించసాగాడు. చిన్నారికి ఆహారం ఇవ్వకుండా, కనీసం ధరించేందుకు బట్టలు కూడా ఇవ్వకుండా బాత్‌ర్రూంలో బంధించి, చిత్రహింసలకు గురి చేయసాగాడు. ఈ దారుణ సంఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కలకలం రేపింది. మూడో వివాహానికి కూతురు అడ్డొస్తుందన్న కారణంతో పాపను బయటికి రానివ్వకుండా ఇంట్లోనే బంధించినట్లు ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. సీఐ జానకీరాం వెల్లడించిన వివరాల ప్రకారం..

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట పట్టణం నాగమయ్య బజార్‌లో నక్కా ప్రవీణ్ అనే వ్యక్తి తల్లి, ఐదేళ్ల కూతురుతో కలిసి నివాసం ఉంటున్నాడు. మొదటి భార్యతో అతనికి పెళ్లైన కొన్ని రోజులకే విడాకులయ్యాయి. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ద్వారా అతనికి లోహిత అనే కుమార్తె జన్మించింది. ప్రవీణ్‌ చిత్రహింసలు తట్టుకోలేక నాలుగేళ్ల క్రితం రెండో భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కూతురు లోహిత ఒంటరైంది. నానమ్మ గోవర్ధనమ్మతో కలిసి తండ్రి ప్రవీణ్ నిత్యం చిన్నారిని వేదించసాగారు. తాజాగా మూడో వివాహానికి సిద్ధపడ్డ గోవర్ధన్‌ కూతురు అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు. గోవర్ధనమ్మ, ప్రవీణ్‌ ఇద్దరూ చిన్నారిని ఇంట్లోనే బంధించారు.

టికీలు మూసేసి, తాళ్లతో కట్టేశారు. ఆహారం సరిగ్గా పెట్టకపోవడంతో పాప నీరసించి, అనారోగ్యం పాలైంది. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీసులకు సమాచారమివ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది వెళ్లి చూడగా, ఆ పాపను బాత్రూంలో బకెట్లో కూర్చోపెట్టి పైన గుడ్డలు కప్పారు. వెంటనే పోలీసులు చిన్నారిని బయటకు తీసుకొచ్చి, బట్టలు ధరింపజేసి ఏం జరిగిందో చిన్నారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిత్యం తండ్రి, నానమ్మ కొట్టేవారని, అన్నం పెట్టకుండా వేధించేవారని చిన్నారి తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.