Viral: పోలీసు ఇంటికే కన్నం వేసిన దొంగలు.! సామాన్యుల పరిస్థితి ఏంటని చర్చ..
సాధారణంగా ఇంట్లో దొంగలు పడితే పోలీసులకు చెబుతాం.. కానీ పోలీసుల ఇళ్ళలోనే దొంగలు పడితే.. వారు ఎవరికి చెప్పుకుంటారు. అదే పరిస్థితి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చోటు చేసుకుంది. పాలకొండలో శుక్రవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు రాత్రికి రాత్రి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ముగ్గురు ఇళ్లల్లో చోరీలకు పాల్పడితే బాధితుల్లో దిశ SI తో పాటు ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు.
సాధారణంగా ఇంట్లో దొంగలు పడితే పోలీసులకు చెబుతాం.. కానీ పోలీసుల ఇళ్ళలోనే దొంగలు పడితే.. వారు ఎవరికి చెప్పుకుంటారు. అదే పరిస్థితి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చోటు చేసుకుంది. పాలకొండలో శుక్రవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు రాత్రికి రాత్రి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ముగ్గురు ఇళ్లల్లో చోరీలకు పాల్పడితే బాధితుల్లో దిశ SI తో పాటు ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. పోలీసుల ఇళ్లల్లోనే దొంగతనాలు జరగటం.. అది కూడా DSP కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ దొంగతనాలు జరగటం పోలీసులకే సవాలుగా మారింది. పాలకొండ DSP కార్యాలయానికి సమీపంలోనే నివాసం ఉంటోన్న దిశ పోలీస్ స్టేషన్ SI లావణ్య వీధుల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రానికి వెళ్ళారు. రాత్రికి పార్వతీపురంలోనే ఉండిపోయారు. ఆమె తల్లి రూప సైతం అదే రోజు ఊరుకి వెళ్ళారు. అది గమనించిన దొంగలు అదే రోజు రాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి చోరీకి పాల్పడ్డారు. మరుసటి రోజు పక్కంటి వారు ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి SI కి సమాచారం ఇవ్వగా దొంగతనం అయినట్లు గుర్తించారు. ఓ ఇంట్లో ఉంచిన 30 వేల రూపాయల నగదు, తులం బంగారం చోరీ అయినట్లు తెలిపారు.
దిశ SI నివాసంకి సమీపంలోనే ఓ కానిస్టేబుల్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఇంట్లో నగదు, బంగారం వంటి విలువైన వస్తువుల కోసం వెతికినప్పటికి వారికి ఏమి లభించకపోవడంతో తిరిగి వెనుతిరిగారు. ఆ ఇంటికి పక్క వీధి శ్రీనివాస నగర్ లో పంచాయితీరాజ్ శాఖ ఉద్యోగి గార కాంతారావు నివాసాన్ని అదే రోజు రాత్రి కొల్లగొట్టారు దొంగలు. కాంతారావు కుటుంభం కాశీకి వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేకపోవటం గమనించి ఇంటి వెనుక మార్గం గుండా లోపలికి ప్రవేశించి లక్షా 60వేల నగదుతో పాటు ముప్పావు తులం బంగారాన్ని దోచేశారు. పోలీసుల ఇళ్లకే భద్రత లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనిచర్చించుకుంటున్నారు. ఇటు పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. క్లూస్ టీం ఘటనాస్థలాల్లో ఆధారాలు సేకరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.