నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో వివాదం రాజుకుంది. కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థి తరపున ఓటర్లకు పంచిన కుక్కర్లను, డబ్బులను పోలింగ్ తర్వాత వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు రోడ్డుపై కుక్కర్లను పడవేసి నిరసన తెలిపారు. తాము ఎవరికి ఓటు వేశామో కౌంటింగ్ ముందే వీరు ఎలా ఆరోపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి..గెలుపు కోసం రాజకీయ పార్టీలు సర్వ శక్తులు ఒడ్డాయి..గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నా..లో లోపల ఆందోళన చెందుతున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో పదవ వార్దు లో కాంగ్రెస్ అభ్యర్థి ఇలాగే ఆందోళన చెంది..తాను పంచిన కుక్కర్లు వెనక్కి ఇవ్వాలంటూ పేచీ పెట్టాడు. దీనితో కాలనీవాసులు రోడ్డెక్కి ఆందోళన చేశారు.ఎన్నికలకు గిఫ్ట్ లుగా ఇచ్చిన కుక్కర్లు, గిఫ్ట్ లు రోడ్డుపై పడవేసి ఆందోళన చేపట్టారు. పదో వార్డులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలంటూ డబ్బులు కుక్కర్లు ఇవ్వటంతో ఓటర్లు అందరూ తీసుకున్నారు. నిన్న ఎలక్షన్ ఎన్నిక జరిగిన తర్వాత రాత్రి నుండి డబ్బులు కుక్కర్ లు పంచిన వ్యక్తి తమ ఇళ్లకు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుండా మీరు కుక్కర్ లు డబ్బులు ఎందుకు తీసుకున్నారంటూ వేధించటం అవన్నీ వెనక్కి ఇవ్వాలని దూషిస్తున్నాడని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. కాలనీలో మహిళలందరూ తమకు ఇచ్చిన కుక్కర్లో మొత్తం తీసుకువచ్చి వారి పేర్లు ఆ బాక్స్లపై రాసి నడిరోడ్డుపై పడవేశారు మేము అడగకుండా మాకు గిఫ్ట్లు ఇచ్చి ఇప్పుడు వెనక్కి అడగటం ఏమిటని, అసలు ఇంకా కౌంటింగ్ కూడా జరగకుండా ఓట్లు మేము వేయలేదని వీళ్లు ఎలా అంటున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 5 ET: అల్లు అర్జున్ పై దుష్ప్రచారం వెనుక… | గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుందోచ్..
TOP 9 ET: ఆ సంతోషాన్ని, భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేను
Andhrapradesh: 99 పైసలకే కంపెనీలకు భూములు..మండలిలో మాటల మంటలు
Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధర.. ఇవాళ తులం ఎంతంటే
నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు

