CBSE Board Exam Time Table 2024: 10వ, 12వ తరగతుల సీబీఎస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ 2024 విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

CBSE Board Exam 10th, 12th Date Sheet 2024: పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌-2024ను సీబీఎస్సీ మంగళవారం (డిసెంబర్‌ 12) విడుదల చేసింది. 10వ, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి ఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై మార్చి 13తో ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై ఏప్రిల్‌ 2వ తేదీతో ముగుస్తాయని ఎగ్జాం కంట్రోలర్..

CBSE Board Exam Time Table 2024: 10వ, 12వ తరగతుల సీబీఎస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ 2024 విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
CBSE Board Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 12, 2023 | 7:40 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 12: పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌-2024ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) మంగళవారం (డిసెంబర్‌ 12) విడుదల చేసింది. 10వ, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి ఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై మార్చి 13తో ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై ఏప్రిల్‌ 2వ తేదీతో ముగుస్తాయని ఎగ్జాం కంట్రోలర్ సన్యాం భరద్వాజ్‌ తెలిపారు.

10వ, 12వ తరగతుల బోర్డు పరీక్షలు మొదటి రోజు (ఫిబ్రవరి 15) రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్‌ పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. రెండో సెషన్‌ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. ఇతర రోజులలో ఒకటి, రెండు, మూడు, నాలుగు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) వంటి పోటీ పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకుని 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించినట్లు ఎగ్జాం కంట్రోలర్ జోడించారు.

గతేడాది 10వ తరగతి బోర్డు పరీక్షలకు మొత్తం 21,658,05 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 20,167,79 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. 93.12 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. ఇక గతేడాది 12వ తరగతి బోర్డు పరీక్షలకు మొత్తం 16.9 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 7.4 లక్షల మంది బాలికలు, 9.51 లక్షల మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 12వ తరగతికి సంబంధించి మొత్తం ఉత్తీర్ణత శాతం 87.33 శాతంగా ఉంది. 99.91 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

సీబీఎస్సీ 10వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ కోసం క్లిక్‌ చేయండి.

సీబీఎస్సీ 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న