Crime News: అమానుష ఘటన.. కొడుకుపై కక్ష్యతో తల్లిని నగ్నంగా వీధుల్లో ఊరేగించిన బంధువులు
కర్ణాటకలో సభ్య సమాజం తలదించుకునే ఘోర సంఘటన వెలుగు చూసింది. ఓ మహిళను వివస్త్రను చేసి రోడ్లపై ఊరేగించారు. ఆనంతరం కరెంట్ స్తంబానికి కట్టేసి దారుణంగా కొట్టారు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళగావి జిల్లాలోని ఒకే గ్రామానికి చెందిన యువతి ప్రియాంక (20), యువకుడు అశోక్ (24) గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఇటీవలే..
బెళగావి, డిసెంబర్ 12: కర్ణాటకలో సభ్య సమాజం తలదించుకునే ఘోర సంఘటన వెలుగు చూసింది. ఓ మహిళను వివస్త్రను చేసి రోడ్లపై ఊరేగించారు. ఆనంతరం కరెంట్ స్తంబానికి కట్టేసి దారుణంగా కొట్టారు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళగావి జిల్లాలోని ఒకే గ్రామానికి చెందిన యువతి ప్రియాంక (20), యువకుడు అశోక్ (24) గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఇటీవలే మరో యువకుడితో వివాహం నిశ్చయం చేశారు. ఈ క్రమంలో నిశ్చితార్థం కూడా జరిపించారు. దీంతో ప్రేమికులిద్దరూ ఆదివారం రాత్రి ఇళ్ల నుంచి పరారయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు కొత్త వంతమూరి గ్రామంలోని యువకుడి ఇంటిపై దాడి చేశారు. వారి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి, యువకుడి తల్లిని (42) వీధిలోకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేశారు. అనంతరం ఆమెను నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. అందరూ చూస్తుండగా రచ్చబండ వద్ద ఉన్న కరెంట్ స్తంభానికి తాళ్లతో ఆమెను కట్టివేసి అర్ధరాత్రి వరకు దారుణంగా కొట్టారు. ఇంత జరుగుతున్నా ఊళ్లో ఏ ఒక్కరూ వారిని అడ్డుకోలేదు.
సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను రక్షించి, బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు బెళగావి పోలీస్ కమిషనర్ సిద్ధరామప్ప తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతోపాటు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్, పోలీస్ ఉన్నతాధికారులు ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఇది అత్యంత అమానుష ఘటన అని, సభ్య సమాజం తలదించుకునేలా నేరస్తులు ప్రవర్తించారని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.