మీ ఇంట్లో ఏసీ వాడుతున్నారా? అయితే ఈ వీడియో చూస్తే దడుసుకుంటారంతే.!
మీ ఇంట్లో ఏసీ వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త. కడప జిల్లాలో ఓ ఇంట్లో ఏసీ ఉన్నట్లుండి తగలబడింది. ఆ పెను ప్రమాదం నుంచి కుటుంబం సేఫ్‌గా బయటపడింది. కడప జిల్లా యర్రగుంట్లలో పెను ప్రమాదం తప్పింది. యర్రగుంట్ల టౌన్ కడప రోడ్డులోని సాయిబాబా గుడి సమీపంలోని ఓ ఇంట్లో ఏసీ నుంచి..
మీ ఇంట్లో ఏసీ వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త. కడప జిల్లాలో ఓ ఇంట్లో ఏసీ ఉన్నట్లుండి తగలబడింది. ఆ పెను ప్రమాదం నుంచి కుటుంబం సేఫ్‌గా బయటపడింది. కడప జిల్లా యర్రగుంట్లలో పెను ప్రమాదం తప్పింది. యర్రగుంట్ల టౌన్ కడప రోడ్డులోని సాయిబాబా గుడి సమీపంలోని ఓ ఇంట్లో ఏసీ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. కాసేపటికి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నీటితో మంటలను అర్పే ప్రయత్నం చేశారు. కాని అప్పటికే ఏసీ పూర్తిగా కాలిపోయింది. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పొగలు ఇల్లు మొత్తం వ్యాపించినప్పటికీ.. క్షేమంగా బయటపడ్డారు కుటుంబ సభ్యులు.
ఏసీ విషయంలో పలు సార్లు కంపెనీకి కంప్లైంట్ చేసిన పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాసిరకపు ఏసీలు తయారు చేస్తున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. సరైన టైంలో స్పందించడంతో ప్రాణపాయంతప్పింది. డై టైంలో కావడంతో పెను ప్రమాదం తప్పిందంటూ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విపరీతమైన ఎండలకు తాళలేక చాలామంది తక్కువ టెంపరేచర్ కోసం ఏసీని వాడుతూంటారు. అవి కొన్ని సార్లు చాలా ప్రమాదకరంగా మారతాయి. బయటి వాతావరణానికి, ఏసీలో మనం సెట్ చేసిన వాతావరణానికి చాలా తేడా ఉండడంతో ఏసీ కంప్రెసర్‌పై అధికభారం పడి దానినుండి మంటలు, పొగలు వెలువడే ప్రమాదం ఉంది. దీనితో ఇంటికే ముప్పు రావచ్చు. నాసిరకం ఏసీలు కూడా ఇలాంటి ప్రమాదాలను కలుగజేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షో ఏసీల విషయంలో కొనేటప్పుడు పరిశీలించి కొనాల్సిన బాధ్యత మనదే.