హ్యుమన్ రైట్స్ ఆఫీసర్లమంటూ స్వీట్ షాపులపై ఎటాక్.. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో.!
కాకినాడలో స్వీట్ షాపుల యజమానులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న కేటుగాళ్ల పని పట్టారు పోలీసులు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్, యాంటీ క్రైం బ్యూరో పేరుతో స్వీట్ షాపులపై కొంతమంది బెదిరింపు దాడులు చేశారు.

కాకినాడలో స్వీట్ షాపుల యజమానులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న కేటుగాళ్ల పని పట్టారు పోలీసులు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్, యాంటీ క్రైం బ్యూరో పేరుతో స్వీట్ షాపులపై కొంతమంది బెదిరింపు దాడులు చేశారు. స్వీట్ షాపు యజమానులను వేలల్లో డబ్బులు ఇవ్వాలని.. లేదంటే శాంపిల్స్ తీసి కేసులు పెట్టి సీజ్ చేస్తామని ఓ గ్యాంగ్ హల్చల్ చేసింది. అయితే.. అభిరుచి స్వీట్స్ యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాకినాడ పోలీసులు నకిలీ గ్యాంగ్‌కు సంబంధించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలో పలు స్వీట్ షాపులపై హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చామని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి హ్యూమన్ రైట్స్ ఫేక్ ఐడీ కార్డ్, కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు కాకినాడ పోలీసులు. అటు.. మూడు రోజుల నుంచి ఇలా కొందరు బెదిరిస్తున్నారని షాపు యజమానులు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో బెదిరింపులకు దిగి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు పోలీసులు.