CSIR CASE 2023 Notification: సీఎస్‌ఐఆర్- కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్)- కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 (సీఏఎస్‌ఈ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కింద దేశ వ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్ పరిశోధన కేంద్రాలు, కార్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 444 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్)- కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 (సీఏఎస్‌ఈ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కింద దేశ వ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్ పరిశోధన కేంద్రాలు, కార్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 444 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో సెక్షన్ ఆఫీసర్ (జనరల్/ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/ స్టోర్స్ అండ్ పర్చేజ్) పోస్టులు 76 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్/ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/ స్టోర్స్ అండ్ పర్చేజ్) పోస్టులు 368 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తు దారుల వయోపరిమితి 33 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 12, 2024 నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 14, 2024వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తులు ముగుస్తాయి. దరఖాస్తు సమయంలో దరఖాస్తు రుసుము కింద యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు రూ.500 చెల్లించవల్సి ఉంటుంది. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్షలు (స్టేజ్ 1, 2), ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్టేజ్ 1 పరీక్ష ఫిబ్రవరి, 2024లో ఉంటుంది. అర్హత సాధించిన వారికి సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు రూ.47,600 నుంచి రూ.1,51,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకైతే రూ.44,900 నుంచి 1,42,400 వరకు జీత భత్యాలు చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య: 444
- సెక్షన్ ఆఫీసర్ (జనరల్/ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/ స్టోర్స్ అండ్ పర్చేజ్) పోస్టులు: 76
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్/ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/ స్టోర్స్ అండ్ పర్చేజ్) పోస్టులు: 368
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.