AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaikunta Ekadashi 2023: వైకుంఠ ఏకాదశి పర్వదినం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ప్రస్తుతం 4లక్షల 24వేల టోకెన్లను ఆఫ్‌లైన్‌లో కౌంటర్ల ద్వారా ఇష్యూ చేస్తోంది. టోకెన్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుండటంతో టికెట్ల కోసం పోటీపడుతున్నారు భక్తులు. మరోవైపు, తిరుమల శ్రీవారి దర్శనానికి 16గంటలకు పైగా టైమ్‌ పడుతోంది. నిన్న ఒక్కరోజే సుమారు 60వేల మంది దర్శించుకోగా, ప్రస్తుతం అంతకుమించి భక్తులు దర్శనం వెయిట్‌ చేస్తున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. ఇదిలా ఉంటే, అటు శ్రీశైలంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Vaikunta Ekadashi 2023: వైకుంఠ ఏకాదశి పర్వదినం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Vaikuntha ekadashi 2023 celebrations
Jyothi Gadda
|

Updated on: Dec 22, 2023 | 4:08 PM

Share

తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం పోటెత్తుతోంది. ఎటుచూసినా, ఎక్కడ చూసినా భక్తులే. కొండ పైనా-కిందా ఒకటే రద్దీ. రేపట్నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉండటంలో టోకెన్ల కోసం పోటెత్తుతున్నారు భక్తులు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం నిన్నటి నుంచే క్యూలైన్లలో పడిగాపులు పడుతున్నారు భక్తులు.

అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో షెడ్యూల్‌ కంటే ముందే టోకెన్ల జారీ మొదలుపెట్టింది టీటీడీ. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ మధ్యాహ్నం నుంచి టికెట్లు జారీ చేయాల్సి ఉండగా… భక్తుల రద్దీతో గత అర్థరాత్రి నుంచే టోకెన్లు ఇస్తోంది. ఒక్క తిరుపతిలోనే 90కి పైగా కౌంటర్ల ద్వారా టికెట్లు ఇష్యూ చేస్తోంది టీటీడీ.

ఇప్పటికే, రెండు లక్షల 25వేల టికెట్లు, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసింది టీటీడీ. ప్రస్తుతం 4లక్షల 24వేల టోకెన్లను ఆఫ్‌లైన్‌లో కౌంటర్ల ద్వారా ఇష్యూ చేస్తోంది. టోకెన్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుండటంతో టికెట్ల కోసం పోటీపడుతున్నారు భక్తులు

ఇవి కూడా చదవండి

మరోవైపు, తిరుమల శ్రీవారి దర్శనానికి 16గంటలకు పైగా టైమ్‌ పడుతోంది. నిన్న ఒక్కరోజే సుమారు 60వేల మంది దర్శించుకోగా, ప్రస్తుతం అంతకుమించి భక్తులు దర్శనం వెయిట్‌ చేస్తున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి ఉన్నాయి.

ఇదిలా ఉంటే, అటు శ్రీశైలంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. రేపు వైకుంఠ ఏకాదశి. తర్వాత రెండు రోజులు వరుసగా సెలవులు. దీంతో శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు.. అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి రేపటి నుంచి మూడురోజుపాటు నాలుగు విడతలుగా అనుమతించనున్నట్లు చెప్పారు. టికెట్లను దేవస్థానం వైబ్​సైట్​ ద్వారా నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

— శ్రీశైలంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి..ఏకాదశి రోజు తెల్లవారుజామున స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, రావణ వాహన సేవ నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయంలో పూజలు చేసి.. స్వామి వారి ఆలయ ముఖ మండప ఉత్తర ద్వారం గుండా తీసుకొచ్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..