AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శీతాకాల సెలవుల కోసం స్వాగతం పలుకుతున్న ప్రభుత్వ హోటళ్లు.. తక్కువ ధర.. విలాసవంతమైన సౌకర్యం!

చాలా రాష్ట్రాల్లో టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రైవేటు హోటళ్ల సంఖ్య ఎక్కువగా లేకపోవడంతో పర్యాటకులకు మంచి వసతి కల్పించాల్సిన అవసరం ఉన్నందున ప్రభుత్వ హోటళ్లను ప్రారంభించారు. ఇప్పుడు ప్రైవేట్ హోటళ్ల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ హోటళ్లకు కాస్త డిమాండ్ తగ్గింది. కానీ ఫీచర్ల పరంగా ఈ హోటల్స్ ఇతర ప్రైవేట్ హోటళ్ల కంటే తక్కువేమీ కాదు. మన రాష్ట్రంలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోనూ అనేక ఉత్తమ ప్రభుత్వ హోటళ్లు ఉన్నాయి.

శీతాకాల సెలవుల కోసం స్వాగతం పలుకుతున్న ప్రభుత్వ హోటళ్లు.. తక్కువ ధర.. విలాసవంతమైన సౌకర్యం!
New Year Trip Plan
Jyothi Gadda
|

Updated on: Dec 22, 2023 | 3:16 PM

Share

ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ హోటళ్లు అన్నీ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. హోటళ్ల విషయానికి వస్తే ప్రభుత్వ హోటళ్ల కోసం ఎవరూ చూడరు. ఇది మనం చేసే మొదటి తప్పు. తక్కువ ఖర్చుతో ట్రిప్‌ని ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే మంచి ఆలోచన ఉండదు. విహారయాత్రకు వెళ్లేముందు మనం ఎక్కడ ఉండాలనేది ముందుగానే ఆలోచిస్తాం. సాధారణంగా మనం హోటల్ బుక్ చేసుకున్న తర్వాత విహారయాత్రకు వెళ్తుంటాం. ఇక ఏడాది చివర్లో వింటర్‌ వెకేషన్స్‌ కోసం టూర్లకు వెళ్లేవారికి హోటల్ బుకింగ్ కష్టంగా మారుతుంది. ధర కూడా ఖరీదు అవుతుంది.. ఇవన్నీ తెలిసినా కూడా ప్రయివేటు హోటళ్లపై దృష్టి సారించడం వల్ల ప్రభుత్వ హోటళ్లను పట్టించుకోవడం లేదు. హోటల్ మనం వెళ్లే ట్రిప్స్‌, సైడ్‌ సీన్స్‌ ప్రదేశానికి దగ్గరగా ఉండాలి. అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలని కోరుకుంటాం.. కాబట్టి అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయని భావించి ప్రైవేట్ హోటల్ కోసం చూస్తాము.. కానీ, ప్రభుత్వ హోటళ్లు కూడా మీకు ఇలాంటి అన్ని సౌకర్యాలను అందిస్తాయి. చిన్న చిన్న సమస్యలు ప్రతిచోటా ఉన్నాయి. మీరు పర్యాటక ప్రదేశాలను ఆస్వాదించాలనుకుంటే చిన్న లోపాలను విస్మరించాలనుకుంటే ప్రభుత్వ హోటళ్లు మీకు ఉత్తమమైనవి.

ప్రభుత్వ హోటల్ అంటే ఏమిటి? : మనదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వ శాఖలు ఏర్పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రైవేటు హోటళ్ల సంఖ్య ఎక్కువగా లేకపోవడంతో పర్యాటకులకు మంచి వసతి కల్పించాల్సిన అవసరం ఉన్నందున ప్రభుత్వ హోటళ్లను ప్రారంభించారు. ఇప్పుడు ప్రైవేట్ హోటళ్ల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ హోటళ్లకు కాస్త డిమాండ్ తగ్గింది. కానీ ఫీచర్ల పరంగా ఈ హోటల్స్ ఇతర ప్రైవేట్ హోటళ్ల కంటే తక్కువేమీ కాదు. మన రాష్ట్రంలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోనూ అనేక ఉత్తమ ప్రభుత్వ హోటళ్లు ఉన్నాయి.

గోవా:

ఇవి కూడా చదవండి

గోవా పర్యాటకుల స్వర్గధామం. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు వస్తుంటారు. ఫార్మాగుడి రెసిడెన్సీ గోవాలోని ప్రభుత్వ హోటల్. అక్కడ హాయిగా ఉండొచ్చు. ఫార్మగుడి రెసిడెన్సీలో ఇండోర్, అవుట్‌డోర్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ మీరు చాలా తక్కువ ధరలో గదిని బుక్ చేసుకోవచ్చు. సీజన్‌లో డబుల్ బెడ్ రూమ్‌కు రోజుకు రూ.1500 వసూలు చేస్తున్నారు. 1100 ఆఫ్ సీజన్‌లో వసూలు చేయబడుతుంది.

హోటల్ ఆనంద్ భవన్ :

ఉదయపూర్‌లోని హోటల్ ఆనంద్ భవన్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలోని హోటల్. ఇక్కడ మీరు 1900 రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు.

సిమ్లా పీటర్‌హోఫ్ హోటల్:

సిమ్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో సిమ్లా టూర్‌ను పూర్తి చేయాలనుకునే వారు పీటర్ హాఫ్ హోటల్‌ను ఎంచుకోవచ్చు. ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ కేవలం 2700 రూపాయలకే దొరుకుతుంది.

ప్రభుత్వ హోటల్‌ను ఎలా బుక్ చేసుకోవాలి? :

మీరు హిమాచల్ ప్రదేశ్ నుండి కర్ణాటక, కేరళ వరకు అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ హోటళ్లలో బస చేసేందుకు వెసులుబాటు ఉంది.. మీరు విహారయాత్రకు వెళ్లే ముందు ప్రభుత్వ హోటళ్లపై శ్రద్ధ వహించండి. ఈ హోటళ్లను ఆయా రాష్ట్ర పర్యాటక శాఖ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Follow Us
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..