Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Devi Puja: సాయంత్రం వేళ పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. లక్ష్మీదేవికి ఆగ్రహం కలగవచ్చు..

లక్ష్మీ దేవి ఆశీస్సులు తమపై, తమ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. అందుకు తగిన విధంగా పూజాదికార్యక్రమాలని నిర్వహిస్తారు. అయితే జ్యోతిష్యం ప్రకారం సాయంత్రం పూట కొన్ని పనులు చేయకూడదు. ఇలా చేయడం వల్ల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట కొన్ని పనులు చేయడం అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ రోజు పొరపాటున కూడా సాయంత్రం చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం.. 

Lakshmi Devi Puja: సాయంత్రం వేళ పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. లక్ష్మీదేవికి ఆగ్రహం కలగవచ్చు..
Astro Tips For Lakshmi Devi
Follow us
Surya Kala

|

Updated on: Dec 22, 2023 | 3:00 PM

హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యానికి దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి సంతోషంగా ఉంటే డబ్బుకు లోటు ఉండదని, ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం. అయితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగితే ఆ ఇంట్లో సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. ఆ ఇంట్లో ఆర్ధిక బాధలతో, పేదరికంతో ఇబ్బంది పడతారని విశ్వాసం. అందువల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాల పూజలు చేస్తారు.

లక్ష్మీ దేవి ఆశీస్సులు తమపై, తమ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. అందుకు తగిన విధంగా పూజాదికార్యక్రమాలని నిర్వహిస్తారు. అయితే జ్యోతిష్యం ప్రకారం సాయంత్రం పూట కొన్ని పనులు చేయకూడదు. ఇలా చేయడం వల్ల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట కొన్ని పనులు చేయడం అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ రోజు పొరపాటున కూడా సాయంత్రం చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..

  1. సాయంత్రం వేళ నిద్ర: సనాతన విశ్వాసాల ప్రకారం సాయంత్రం నిద్రించడం అంటే సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవడం అశుభం. ఈ సమయంలో సూర్యుడికి తల్లి అర్ఘ్యం సమర్పిస్తుందని.. దేవతలు ఆకాశంలో విహరిస్తారని.. ఆశీర్వాదం ఇస్తారని నమ్మకం. ఈ సమయంలో నిద్రిస్తే.. దేవతల అనుగ్రహం కోల్పోతారని నమ్ముతారు. అలాగే సాయంత్రం నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
  2. తులసికి నీళ్ళు పెట్టకండి: హిందూ మతంలో తులసి మొక్కను లక్ష్మిదేవి స్వరూపంగా భావిస్తారు. సాయంత్రం వేళ తులసికి నీరు సమర్పించడం, తులసిని తాకడం పూర్తిగా నిషేధం. ఇలా చేయడం వల్ల సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఇంటిని శుభ్రం చేయవద్దు: సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చడం, తుడుచుకోవడం వంటి పనులు అశుభంగా భావిస్తారు. సాయంత్రం వేళ ఊడ్చడం లేదా తుడుచుకోవడం లక్ష్మీ దేవిని అసంతృప్తికి గురిచేస్తుందని .. ఆ ఇంట్లో పేదరికాన్ని తెస్తుందని చెబుతారు.
  5. ఈ వస్తువులను దానం చేయవద్దు: సాయంత్రం వేళల్లో పాలు, పెరుగు, వెల్లుల్లి, ఉల్లి, పసుపు, సూది వంటివి ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు, అదే సమయంలో  ఎవరికీ ఇవ్వవద్దు. సాయంత్రం పూట వీటిని ఇవ్వడం తీసుకోవడం అశుభం.
  6. డబ్బు లావాదేవీలు చేయవద్దు: సాయంత్రం వేళల్లో డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండండి. సాయంత్రం లక్ష్మీ దేవిని ఇంటి లోకి స్వాగతం పలికే సమయం.. కనుక ఈ సమయంలో ఎవరికీ అప్పులు ఇవ్వకండి లేదా అప్పులు తీసుకోకండి. ఇలా డబ్బులు ఇవ్వడం తీసుకోడం ఆర్థిక సంక్షోభాన్ని ఆహ్వానించినట్లే..
  7. ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచండి: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం వేళలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతించడానికి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు