Angkor Wat Temple: ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయం ఎక్కడున్నదో తెలుసా..

ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయం మన దేశం వెలుపల కంబోడియాలో ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం విష్ణుమూర్తి. దీనిని ఆంగ్‌కార్ వాట్ దేవాలయం అని పిలుస్తారు. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ నిర్మించిన ఈ వైష్ణవాలయం ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించారు. అంగ్కోర్ వాట్ ఆలయ గోడలపై హిందూ పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు, దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి

Angkor Wat Temple: ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయం ఎక్కడున్నదో తెలుసా..
Angkor Wat
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2023 | 9:59 AM

భారతదేశం ఆధ్యాత్మికత నెలవు. అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ లక్షలాది చిన్న పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం మన దేశంలో లేదు. కంబోడియాలో ఉంది. దీనిని  ఆంగ్కోర్ వాట్ అనే హిందూ దేవాలయం పిలుస్తారు. అత్యంత పురాతన ఆలయం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులందరూ మంత్రముగ్ధులయ్యేలా ఈ ప్రదేశం అందం చాలా గొప్పగా ఉంటుంది. ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందిన తరువాత అంకోర్ వాట్ ఆలయం కంబోడియాకి ఓ ప్రత్యేక గుర్తింపుని తీసుకుని వచ్చింది. ఈ ఆలయ చిత్రం కంబోడియా జాతీయ జెండాపై  ఉంది.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు

అంగ్కోర్ వాట్ ఆలయం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. అంగ్కోర్ వాట్ ఆలయాన్ని యశోధరపూర్ అని కూడా అంటారు. ఈ ఆలయం 402 ​​ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి లక్షల ఇసుక రాళ్లను ఉపయోగించారని.. ఒక రాయి బరువు ఒకటిన్నరటన్ను అని చెబుతారు.

అంగ్కోర్ వాట్ ఆలయ చరిత్ర

మికాంగ్ నది ఒడ్డున ఉన్న సిమ్రిప్ నగరంలో అంగ్కోర్ వాట్ ఆలయం చక్రవర్తి సూర్యవర్మన్ II పాలనలో నిర్మించబడింది. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం. అంగ్‌కోర్ వాట్ ఆలయాన్ని 1992లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది.

ఆలయ గోడలపై రామాయణం, మహాభారతం నుండి దృశ్యాలు

అంగ్కోర్ వాట్ ఆలయ గోడలపై హిందూ పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు, దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఆలయ శిల్ప కళా సంపద, కళా నైపుణ్యం చూపరులను ఆకట్టుకుంటుంది. అంగ్కోర్ వాట్ దేవాలయం ఒక ప్రత్యేకమైన నిర్మాణ సౌందర్యాన్ని కలిగి ఉంది.దీనిని చూడటానికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..