Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tuesday Puja Tips: జాతకంలో శని దోషం ఉందా.. ఆర్ధిక ఇబ్బందులా మంగళవారం హనుమంతుడిని పూజించి చూడండి..

చిరంజీవి హనుమంతుడు ప్రతి యుగంలో తన భక్తుల కష్టాలను తీర్చి ఆశీస్సులను అందిస్తాడని విశ్వాసం. భయం, దురదృష్టం హనుమంతుని భక్తుడికి దూరంగా ఉంటుందని నమ్ముతారు. ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడికి సంబంధించిన ఏదైనా దోషం ఉన్నట్లయినా.. లేదా ఏలి నాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నా.. జీవితంలో సకల సంతోషాలు, సంపదలు, అదృష్టాలను ప్రసాదించే హనుమంతుడి సాధనకు సంబంధించిన సరళమైన మార్గాలను ఈ రోజున తెలుసుకుందాం.. 

Tuesday Puja Tips: జాతకంలో శని దోషం ఉందా.. ఆర్ధిక ఇబ్బందులా మంగళవారం హనుమంతుడిని పూజించి చూడండి..
Lord Hanuman Puja
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2023 | 8:19 AM

హిందువులు పూజించే దేవుళ్లలో ప్రముఖ స్థానం హనుమంతుడిది. మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడని విశ్వాసం. సనాతన సంప్రదాయంలో  శ్రీ హనుమంతుడు సాధన చాలా సరళంగా, త్వరగా ఫలవంతంగా పరిగణించబడుతుంది. చిరంజీవి హనుమంతుడు ప్రతి యుగంలో తన భక్తుల కష్టాలను తీర్చి ఆశీస్సులను అందిస్తాడని విశ్వాసం. భయం, దురదృష్టం హనుమంతుని భక్తుడికి దూరంగా ఉంటుందని నమ్ముతారు. జీవితంలో సకల సంతోషాలు, సంపదలు, అదృష్టాలను ప్రసాదించే హనుమంతుడి సాధనకు సంబంధించిన సరళమైన మార్గాలను ఈ రోజున తెలుసుకుందాం..

  1. సనాతన సంప్రదాయంలో హనుమంతుడిని ఎప్పుడైనా పూజ చేయవచ్చు. అయితే శరీరం, మనస్సును శుద్ధి చేసుకున్న తర్వాత ఉదయం లేదా సాయంత్రం హనుమంతుడిని పూజించడం సముచితం.
  2. హనుమంతుడిని పూజించేటప్పుడు నియమ నిబంధనలను పాటించాలి. మంగళవారం అంజనీ సుతుడిని  ధ్యానించే సాధకుడు బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించాలి.
  3. సనాతన సంప్రదాయంలో ఏదైనా దేవత పూజలో మంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీ హనుమంతుడి  ఆశీస్సులు పొందడానికి మంగళవారం రుద్రాక్ష జపమాలతో ‘ఓం శ్రీ హనుమతే నమః’ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు జపించాలి.
  4. హనుమాన్ చాలీసా పారాయణం ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధిలను ఇచ్చే శ్రీ హనుమంతుడి అనుగ్రహాన్ని పొందడానికి చాలా సులభమైన, ప్రభావవంతమైన మార్గం. అందులో రాసిన చౌపాయ్ జీవితానికి సంబంధించిన సకల సంతోషాలను అందించి బాధలను దూరం చేయబోతోంది. అటువంటి పరిస్థితిలో  ఏదైనా కోరిక నెరవేరాలంటే మంగళవారం నాడు శ్రీ హనుమాన్ చాలీసాను ఏడు సార్లు పఠించండి.
  5. ఇవి కూడా చదవండి
  6. హనుమాన్ చాలీసా లాగా హనుమనాష్టకం చదవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మంగళవారం నాడు హనుమంతుడిని స్తుతించే హనుమనాష్టకం పఠించడం ద్వారా సాధకులకు శారీరక, మానసిక ఇబ్బందులతో పాటు, భయాలు తొలగిపోతాయని నమ్మకం.
  7. హనుమంతుని వివిధ రూపాల సాధన వివిధ రకాల కోరికలను నెరవేరుస్తుంది. బాల హనుమంతుడిని పూజించడం వల్ల చిన్న పిల్లలకు తరచుగా కలిగే భయం తొలగిపోయినట్లే, ధ్యాన భంగిమలో హనుమంతుడిని పూజించడం వల్ల మనస్సులో ఏకాగ్రత వస్తుంది. పర్వతాన్ని మోసిన హనుమంతుడిని పూజిస్తే ఎటువంటి  విపత్తుల నుండైనా రక్షణ లభిస్తుంది.
  8. ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడికి సంబంధించిన ఏదైనా దోషం ఉన్నట్లయినా.. లేదా ఏలి నాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నా.. కష్టాలను తొలగిపోవడానికి మంగళవారం, శనివారాల్లో శ్రీ హనుమంతుని మహిమను కీర్తిస్తూ సుందరకాండను పఠించండి.
  9. హనుమంతుడి ఆరాధనలో సిందూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మంగళవారం రోజున వాయుసుతుడికి  ఇష్టమైన సింధూరాన్ని, సింధూర వస్త్రాన్ని సమర్పించి పూజించడం ద్వారా అతని అదృష్టం సూర్యుడి వలె ప్రకాశిస్తుంది. అన్ని రకాల ఆనందాలను పొందుతాడు అని నమ్ముతారు.
  10. మంగళవారం నాడు  హనుమంతుని ఆరాధనలో తమలపాకుకు చాలా ప్రాముఖ్యత ఉంది. బజరంగ బలికి తమలపాకులను సమర్పించడం వలన ప్రణాళికాబద్ధమైన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సమయానికి పూర్తవుతాయని.. కుటుంబంలో ఐక్యత, ప్రేమపూర్వక ప్రవర్తన నిర్వహించబడుతుందని నమ్మకం.
  11. హనుమంతుని ఆరాధనలో ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడి నుండి కోరుకున్న ఆశీర్వాదాలు పొందడానికి సాధకుడు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నెయ్యితో చేసిన బూందీ లడ్డుని లేదా లడ్డూను సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంచాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు