భారతదేశంలో కొన్ని దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం నిషేధం.. ఏఏ ఆలయాలంటే..
ముఖ్యంగా స్త్రీలు రుతుక్రమం సమయంలో పూజ చేకూడదని.. ఆలయాలకు వెళ్లరాదని నియమము ఒకటి. మిగిలిన రోజుల్లో దేవాలయాలకు పురుషులతో సమానంగా స్త్రీలు వెళ్లి పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం నిషిద్ధం. ముఖ్యంగా రుతుక్రమం వచ్చే వయసులో కొన్ని ఆలయాలకు వెళ్ళడానికి అనుమతి లేదు. కేరళలోని అయ్యప్ప ఆలయం మాత్రమే కాదు దేశంలో మహిళలకు ప్రవేశం లేని అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాంటి కొన్ని దేవాలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
హిందూ సనాతన ధర్మంలో ప్రకృతి పురుషుడు సమానమే.. ప్రకృతి ని స్త్రీగా భావిస్తారు. దైవంగా కొలుస్తారు. అంతేకాదు దేవుడి ముందు పేద ధనిక, స్త్రీ పురుషులనే బేధం లేదని అందరూ సమానమని విశ్వాసం. అదే సమయంలో పూజ విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఆచారాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలు రుతుక్రమం సమయంలో పూజ చేకూడదని.. ఆలయాలకు వెళ్లరాదని నియమము ఒకటి. మిగిలిన రోజుల్లో దేవాలయాలకు పురుషులతో సమానంగా స్త్రీలు వెళ్లి పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం నిషిద్ధం. ముఖ్యంగా రుతుక్రమం వచ్చే వయసులో కొన్ని ఆలయాలకు వెళ్ళడానికి అనుమతి లేదు. కేరళలోని అయ్యప్ప ఆలయం మాత్రమే కాదు దేశంలో మహిళలకు ప్రవేశం లేని అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాంటి కొన్ని దేవాలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పద్మనాభస్వామి ఆలయం, కేరళ
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ విష్ణు దేవాలయం పద్మనాభస్వామి ఆలయం. మన దేశంలో ప్రధాన వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం తిరువనంతపురంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ప్రసిద్ధి. ఈ ఆలయం శ్రీ విష్ణువు భక్తులకు ప్రధాన పూజా స్థలం. ఈ ప్రదేశంలో విష్ణువు విగ్రహం మొదట వెలుగుకి రాగా.. ఆ స్థలంలో పద్మనాభ ఆలయం నిర్మాణం జరిగిందని నమ్ముతారు. ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశించడం నిషేధం. ఈ ఆఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం కూడా.
శబరిమల అయ్యప్ప ఆలయం, కేరళ
శబరిమల శ్రీ అయ్యప్ప దేవాలయం కేరళలోని అత్యంత పురాతనమైన ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. అయ్యప్ప ఆలయానికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల ప్రవేశం నిషేధం.
కార్తికేయ దేవాలయం పుష్కర్, రాజస్థాన్
రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పుష్కర్ లోని బ్రహ్మదేవునికి ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రఖ్యాతిగాంచింది. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కార్తికేయ ఆలయం కూడా చూడదగ్గది. ఈ ఆలయంలోకి మహిళల ప్రవేశం కూడా నిషేధం.
మావాలి దేవి ఆలయం, ఛత్తీస్‌గఢ్
ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని చాలా ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయంలో ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలో మహిళలకు ప్రవేశం నిషేధం. అయితే అమ్మవారిని ఆలయం బయటి నుండి సందర్శించవచ్చు. 400 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో పురుషులకు మాత్రమే లోపలికి దర్శనం.
శని శింగణాపూర్ ఆలయం, మహారాష్ట్ర
శని శింగణాపూర్ దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా మహిళలు లోపలికి వెళ్లి దర్శనం చేసుకోకూడదు. బయటి నుంచే దర్శనం చేసుకోవాలనే నిబంధన ఉంది. అయితే కొంతమంది మహిళలు ఈ సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించి అనుమతి ఇవ్వమని ర్యాలీ కూడా చేపట్టారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు