Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream Astrology: కలలో మీకు మీరే కనిపిస్తే అది శుభామా లేదా అశుభామా.. స్వప్న శాస్త్రం ఏమి చెబుతుందంటే..?

స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ ఏడుపుని మీరే చూడడం చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. కలలో మిమ్మల్ని మీరు ఏడుస్తున్నట్లు చూస్తే .. ఆ వ్యక్తి జీవితంలో ఏదో ఒక పెద్ద విజయాన్ని సొంతం చేసుకోనున్నాడని.. జీవితం విలాసవంతంగా గడపబోతున్నాడని అర్థం. కలలో తనను తాను కన్నీళ్లతో ఏడ్వడం చూడటం అంటే మీ  జీవితంలోని కష్టాలు తగ్గుతాయని.. త్వరలో ఒక శుభవార్త వింటారని విశ్వాసం. 

Dream Astrology: కలలో మీకు మీరే కనిపిస్తే అది శుభామా లేదా అశుభామా.. స్వప్న శాస్త్రం ఏమి చెబుతుందంటే..?
Dream Of Seeing Yourself
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2023 | 6:50 PM

కలలు కనడం ఒక సాధారణ ప్రక్రియ. ప్రతి కల వెనుక మంచి లేదా చెడు సంకేతాలు దాగి ఉంటాయి. అయితే  మనకు వచ్చే కలలను ఎప్పుడూ విస్మరించకూడదని స్వప్న శాస్త్రం. కొన్నిసార్లు ఈ కలలు నిజమవుతాయి. కొన్నిసార్లు అవి నెరవేరవు. అయితే ఆ కలలు ఖచ్చితంగా ఎక్కడో మన జీవితంతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రతి ఒక్కరికీ రకరకాల కలలు ఉంటాయి. అయితే ఈ కలలు స్వప్నశాస్త్రం ప్రకారం మన భవిష్యత్తుకు అద్దం. ఈ కలలు భవిష్యత్తులో మనకు శుభం లేదా అశుభాలు జరగనున్నాయని చెప్పడానికి మాకు సహాయపడతాయని విశ్వాసం.

కలలో మిమ్మల్ని మీరు సంతోషంగా చూస్తే..

మీ కలలో మీరు సంతోషంగా లేదా నవ్వుతూ కనిపిస్తే.. రానున్న కాలంలో కొన్ని శుభవార్తలను వింటారని అర్ధమట. అంతేకాదు జీవితంలో ఆనందం, సిరి సంపదలు పెరుగుతాయని అర్థం.

కలలో మీకు మీరే ఏడ్చినట్లు కనిపిస్తే..

స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ ఏడుపుని మీరే చూడడం చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. కలలో మిమ్మల్ని మీరు ఏడుస్తున్నట్లు చూస్తే .. ఆ వ్యక్తి జీవితంలో ఏదో ఒక పెద్ద విజయాన్ని సొంతం చేసుకోనున్నాడని.. జీవితం విలాసవంతంగా గడపబోతున్నాడని అర్థం. కలలో తనను తాను కన్నీళ్లతో ఏడ్వడం చూడటం అంటే మీ  జీవితంలోని కష్టాలు తగ్గుతాయని.. త్వరలో ఒక శుభవార్త వింటారని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

కలలో మిమ్మల్ని మీరు మరణించినట్లు చూస్తే

డ్రీమ్ సైన్స్ ప్రకారం మీ కలలో మీరు చనిపోవడం లేదా చనిపోతున్నట్లు చూస్తే..  భవిష్యత్తులో సుదీర్ఘ జీవితాన్ని గడపబోతున్నారని అర్థం. అంతే కాదు మీ మృత దేహం స్మశానవాటికలో ఉన్నట్లు లేదా మృతదేహం ఊరేగుతున్నట్లు చూస్తే మీరు విజయం సాధించబోతున్నారని అర్థం. ఇలాంటి కలలు అదృష్టానికి సంకేతాలు.

కలలో మీరు ఎగురుతున్నట్లు కనిపిస్తే..

స్వప్న జ్యోతిష్యం ప్రకారం.. మిమ్మల్ని మీరు కలలో ఎగురుతున్నట్లు చూస్తే మీరు ఒత్తిడికి లోనవుతున్నారని, నిజ జీవితంలో కొన్ని ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం. అయితే ఈ కల రాబోయే కాలంలో మీ జీవితం మారుతుందని.. ఈ సమస్యలు తొలగిపోతాయని సూచిస్తుంది. అయితే ఇలాంటి కలలకు అర్ధం  భవిష్యత్తులో కెరీర్‌లో విజయం సాధిస్తారని కూడా అర్థం.

కలలో మీరు కింద పడిపోతున్నట్లు కనిపిస్తే..

కలలో మీరు ఎత్తు నుండి పడిపోతున్నట్లు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం అశుభం. మీ కలలో మీరు భవనం నుండి పడిపోతున్నట్లు కనిపిస్తే మీ జీవితంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయని లేదా మీకు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు