Geeta Jayanti: కోల్‌కతా వేదికగా లక్షలాదిమంది ఏకకాలంలో గీతా పఠనం.. ప్రధాని మోడీ హాజరు.. రానున్న గిన్నిస్ బుక్ బృందం..

కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్‌లో లక్షలాది మంది ప్రజలు భగవత్ గీతా పఠనం చేయనున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్ || అంటూ లక్షలాదిమంది జపించనున్నారు. వేలాది మంది శంఖాన్ని పూరించనున్నారు. ఈ మహత్తర కార్యక్రమం డిసెంబరు 24న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించి ముమ్మరంగా  చేస్తున్నారు

Geeta Jayanti: కోల్‌కతా వేదికగా లక్షలాదిమంది ఏకకాలంలో గీతా పఠనం.. ప్రధాని మోడీ హాజరు.. రానున్న గిన్నిస్ బుక్ బృందం..
Bhagvat Geeta Chanting
Follow us
Surya Kala

|

Updated on: Dec 14, 2023 | 3:07 PM

హిందువుల పవిత్ర గ్రంథాల్లో భగవద్గీతది విశిష్ట స్థానం. మానవ జీవితానికి సంబంధించిన సమస్యలను.. పరిష్కారాన్ని తెలియజేసే గీత అన్ని వేదాల సారాంశం అని అంటారు. అంత ఎందుకు గీతను చదివితే మానవుడి జీవిత నడవడిక ఎలా ఉండాలనేది స్వయంగా నిర్ణయించుకోవచ్చు అని అంటారు. అటువంటి భగవద్గీత ను కొన్ని లక్షల మంది ఏక కాలంలో పఠిస్తే .. అది ఓ అద్భుతమైన కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోతుంది. అటువంటి చారిత్రాత్మక ఘట్టానికి పశ్చిమ బెంగాల్ ముఖ్య పట్టణం వేదిక కానుంది. వివరాల్లోకి వెళ్తే..

కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్‌లో లక్షలాది మంది ప్రజలు భగవత్ గీతా పఠనం చేయనున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత | అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్|| అంటూ లక్షలాదిమంది జపించనున్నారు. వేలాది మంది శంఖాన్ని పూరించనున్నారు. ఈ మహత్తర కార్యక్రమం డిసెంబరు 24న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించి ముమ్మరంగా  చేస్తున్నారు.  ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది రానున్నారని తెలుస్తోంది. ఈ ‘భగవద్గీత పఠన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమంలో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ప్రతినిధులు కూడా పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు ఇంత మంది కలిసి గీత చదివే కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఈ ‘భగవద్గీత పఠన కార్యక్రమాన్ని అఖిల భారతీయ సంస్కృత పరిషత్, సాంస్కృతిక సంఘం, మోతీలాల్ భారతీ తీర్థ సేవా మిషన్ ఆశ్రమం వంటి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక లేఖ రాసింది. తమ అధికారిక బృందం నుంచి ఐదుగురు ప్రతినిధులు గీతా పఠన కార్యక్రమానికి హాజరు కానున్నారని పేర్కొంది. ఈ బృందం ఈ కార్యమంలో ప్రాథమికంగా నాలుగు విషయాలపై దృష్టి సారించనున్నారని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మొదటిగా లక్షలాది మంది ఏక స్వరంతో గీతాలాపన జరగడం ఇదే తొలిసారి. రెండవది ఏకకాలంలో 20,000 కంటే ఎక్కువ శంఖాలు పూరించబడతాయి. మూడవది బెంగాల్ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం పాటను లక్షలాది మంది పాడనున్నారు. నాల్గవది బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్ లో ఒకటిన్నర వేల మందికి పైగా సాధువులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. దీంతో బెంగాల్‌కు చెందిన ఈ ‘భగవద్గీత పఠనం ప్రపంచ రికార్డు టైటిల్‌ను సొంతం చేసుకుంటుందని పలువురు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆహ్వానించారు. పార్టీలకు అతీతంగా అందరూ ఆహ్వానితులే.

మహాభారతంలో  భగవద్గీత ఒక భాగం. భీష్మ పర్వంలో వస్తుంది. శ్రీ కృష్ణుడు.. అర్జునుడి మధ్య జరిగిన సంభాషణల సమాహారం ఈ భగవద్గీత. మాఘమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు భగవద్గీత జన్మించిందని నమ్ముతారు. అందుకే ఈ రోజున భగవద్గీత జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఈ గీతాపఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..