Buffalo Dung: ఊయలలోని చిన్నారి ముఖంపై పేడ వేసిన గేదె.. 6 నెలలకే నూరేళ్లు నిండిపోయాయిగా..

ఈ విచిత్రమైన కేసులో గేదె ముఖంపై పేడ పడటంతో ఊపిరాడక ఆరు నెలల బాలుడు మరణించాడు. 6 నెలలకే నూరేళ్లు నిండిపోయిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిందని  సంబంధిత వర్గాలు తెలిపాయి. మహోబా జిల్లాలోని కొత్వాలి కుల్పహార్‌లోని సతారి  గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ చిన్నారి బాలుడు మరణించాడు. ఆడుతూ ఉన్న చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Buffalo Dung: ఊయలలోని చిన్నారి ముఖంపై పేడ వేసిన గేదె.. 6 నెలలకే నూరేళ్లు నిండిపోయాయిగా..
Uttar Pradesh
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2023 | 1:05 PM

కనులు తెరిస్తే జననం.. కనులు మూస్తే మరణం .. రెప్ప పాటు ఈ జీవితం అన్నారో సినీ కవి.. అవును కొన్ని సార్లు జరిగిన సంఘటనలు చూస్తే మానవ జీవితం ఇంత అల్పమా అనిపిస్తుంది. ఇప్పుడే చూశాం కూడా మరణించారా అనుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి.. తాజాగా ఓ చిన్నారి బాలుడు దిగ్భ్రాంతికరంగా మరణించాడు. ఈ విచిత్రమైన కేసులో గేదె ముఖంపై పేడ పడటంతో ఊపిరాడక ఆరు నెలల బాలుడు మరణించాడు. 6 నెలలకే నూరేళ్లు నిండిపోయిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిందని  సంబంధిత వర్గాలు తెలిపాయి.

మహోబా జిల్లాలోని కొత్వాలి కుల్పహార్‌లోని సతారి  గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ చిన్నారి బాలుడు మరణించాడు. ఆడుతూ ఉన్న చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ముఖేశ్ యాదవ్ ..నిక్త దంపతులకు యాదవేంద్ర (3), ఆయుష్ (6 నెలలు) అనే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. బుధవారం సాయంత్రం నికిత ఇంటి ఆవరణలో ఉన్న గేదేలకు గడ్డి వేసేందుకు వెళ్లింది. అప్పుడు ఆరు నెలల ఆయుష్ ఏడవడం మొదలు పెట్టాడు. దీంతో తనతో పాటు పిల్లాడిని తీసుకుని పశువుల కొట్టం దగ్గర ఉన్న ఊయలలో వేసి పడుకోబెట్టింది. ఏడుపు మానేసి నిద్రపోతున్న పిల్లాడిని అలా వదిలేసి ఇంట్లో పని చేసుకోవడంలో బిజీ అయ్యింది.

ఇవి కూడా చదవండి

అయితే ఊయల్లో నిద్రపోతున్న ఆయుష్ ముఖంపై గేదె పేడ వేసింది. దీంతో చిన్నారి బాలుడు ఊపిరి ఆడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తల్లి నిక్తకి ఆయుష్ గుర్తుకు వచ్చి ఊయల దగ్గరకు వెళ్లి చూసే సరికి చిన్నారి ముఖంపై ఉన్న పేడను చూసింది. గబగబా తన పిల్లాడిని చేతుల్లోకి తీసుకుంది. అయితే అప్పటికే చిన్నారి బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ఆయుష్ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు మెడికల్ ఇన్​ఛార్జ్ డాక్టర్ పంకజ్​ రాజ్​పుత్ తెలిపారు. కుటుంబసభ్యులు పోస్టుమార్టం నిర్వహించకుండానే చిన్నారి బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారని చెప్పారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఆరుకు పైగా జంతువులను కట్టివేసినట్లు బంధువు వీరేంద్ర తెలిపారు. మృతుడి తండ్రి ముఖేష్ యాదవ్ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..