Viral Video: తల్లి ప్రేమ అంటే ఇదే మరి.. గున్న ఏనుగు ప్రాణాల కోసం సింహాల గుంపుతో శక్తి మించి పోరాడి ఓడిన ఏనుగు
వాస్తవానికి ఏనుగు వివాదాలకు దూరంగా తమ బృందంతో ప్రశాంత జీవితాన్ని గడపడానికి ఎంత ఇష్టపడతాయో.. అదే సమయంలో వీటికి కోపం వస్తే ఏనుగు అంత చెడ్డ జీవి ఇంకొకటి లేదు అనిపిస్తుంది చూపరులకు ఎవరికైనా.. మరి అలాంటి ఏనుగు తన పిల్లల సంరక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటుంది. అలాంటి ఏనుగు ముందు ఏనుగు పిల్లలపై దాడి చేస్తే.. ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి.. ఏనుగు, ఏనుగు కవల పిల్లలను ఓ సింహాల బృందం చుట్టు ముట్టింది. అయితే ఒక్క ఏనుగు దాదాపు 20కి పైగా ఉన్న సింహాలను ఎదుర్కోవడానికి శక్తికి మించి పోరాడింది.
అడవిలో జీవించాలంటే ఒకే ఒక చట్టం ఉంది. అదేమిటంటే బలవంతుడు .. తనకు ఎదురైన శత్రులతో పోరాడి ప్రాణాలను నిలబెట్టుకునే వాడు మాత్రమే అడవిలో మనుగడ సాగించగలదు. అడవిలో క్రూరమైన, భయంకరమైన జంతువులు చిన్న జంతువులను వేటాడుతూ అడవిని పాలిస్తాయి. అందుకనే అడవిలో చిన్న, బలహీనమైన జంతువులు మనుగడ కోసం చాలా కష్టపడతాయి. నిరంతరం ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాయి. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రజలలో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
భూమి మీద అతి పెద్ద జంతువు ఏనుగు. ఇవి చాలా శాంతంగా, మృదువుగా, తెలివిగా ఉంటాయని అందరికి తెలిసిందే.. అయితే వాస్తవానికి ఇవి వివాదాలకు దూరంగా తమ బృందంతో ప్రశాంత జీవితాన్ని గడపడానికి ఎంత ఇష్టపడతాయో.. అదే సమయంలో వీటికి కోపం వస్తే ఏనుగు అంత చెడ్డ జీవి ఇంకొకటి లేదు అనిపిస్తుంది చూపరులకు ఎవరికైనా.. మరి అలాంటి ఏనుగు తన పిల్లల సంరక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటుంది. అలాంటి ఏనుగు ముందు ఏనుగు పిల్లలపై దాడి చేస్తే.. ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి..
ఏనుగు, ఏనుగు కవల పిల్లలను ఓ సింహాల బృందం చుట్టు ముట్టింది. అయితే ఒక్క ఏనుగు దాదాపు 20కి పైగా ఉన్న సింహాలను ఎదుర్కోవడానికి శక్తికి మించి పోరాడింది.
ఇక్కడ వీడియో చూడండి
ఓ ఆడ ఏనుగు తన కవల పిల్లలతో కలిసి నీరు తాగేందుకు నది ఒడ్డుకు వెళ్లడాన్ని వీడియోలో చూడవచ్చు. దాదాపు 20 సింహాలు మూడింటిని చుట్టుముట్టాయి. ప్రమాదాన్ని గుర్తించిన తల్లి ఏనుగు వెంటనే తన పిల్లలను రక్షించడం ప్రారంభించింది. తల్లి కోపాన్ని చూసిన సింహాలు కొంత సేపటికి వెనక్కి తగ్గాయి. అయితే వెంటనే మళ్లీ గుమిగూడి ఒక్కసారిగా కలిసి కట్టుగా ఏనుగుని, కవల పిల్లల్ని చుట్టుముట్టాయి. సింహాలు అన్నీ కలిసి ఒక ఏనుగు పిల్లను పట్టుకున్నాయి. తల్లి కళ్ల ముందే ఆ పిల్ల ఏనుగును పట్టుకుని వెళ్ళిపోయి చంపేశాయి. నిస్సహాయంగా చూస్తూ తల్లి ఏనుగు మరొక పిల్లతో సింహల నుంచి కాపాడు కోవడానికి అక్కడ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది.
లేటెస్ట్‌సైటింగ్స్ అనే ఖాతా ద్వారా ఈ వీడియో YouTubeలో షేర్ చేసింది. ఈ వీడియో ఆఫ్రికాలోని చోబ్ నేషనల్ పార్క్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటనను డెస్మండ్ క్లాక్ అనే గైడ్ తన కెమెరాలో బంధించాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..