వింత వివాహ సంప్రదాయం..! వరుడి సోదరిని పెళ్లి చేసుకున్న వధువు.. పెద్ద కథే ఉందండోయ్‌..

కొందరు ఈ సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కానీ, వారి వివాహం ఎక్కువ కాలం నిలబడలేదని, వారి కుటుంబ జీవితం సజావుగా సాగలేదని చెప్పారు. ఇంక వారి కుటుంబంలో అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తాయని చెప్పారు. వరుడు తన వివాహానికి భౌతికంగా హాజరు కానప్పటికీ, అతను వరుడి వేషంలో షేర్వాణి, తలపాగా ధరించి, సాంప్రదాయక ఖడ్గాన్ని ధరించి పెళ్లికి రెడీ అవుతాడు. ఓపికగా ఇంటి వద్ద వధువు కోసం వేచి ఉంటాడు.

వింత వివాహ సంప్రదాయం..! వరుడి సోదరిని పెళ్లి చేసుకున్న వధువు.. పెద్ద కథే ఉందండోయ్‌..
grooms sister marries bride
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 08, 2023 | 11:32 AM

భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. దేశంలో ఎన్నో ఆచార వ్యవహారాలను అనుసరించే వ్యక్తులు ఉన్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధమైన సంప్రదాయాలను పాటిస్తుంటారు ప్రజలు. ఇక వివాహాలకు సంబంధించి భారతదేశంలో విచిత్రమైన వివాహ సంప్రదాయాలు చూస్తుంటాం. ఇవి కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. పెళ్లికి సంబంధించి ఎన్నో విశిష్ట సంప్రదాయాలు మన దేశంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. వరుడు లేకుండా వివాహాలు జరిగే వింత ఆచారం కూడా ఒకటి ఉంది. ఇది గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో ఇలాంటి వింత వివాహాలు జరుగుతున్నాయి. అవును, గుజరాత్‌లోని ఒక ప్రాంతంలో పెళ్లి సమయంలో వరుడు లేకుండానే పెళ్లి జరిపిస్తారు.. అయితే, ఇక్కడ వరుడికి బదులుగా అతని సోదరి ముందుగా ఆమెను వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత తన సోదరుడి కోసం భార్యను తీసుకువస్తుంది.

భారతీయ వివాహాలను సాధారణంగా పండుగల జరుపుకుంటారు. ఇద్దరు వ్యక్తులు ఒకరిగా మారే ప్రత్యేక క్షణాన్ని చూసేందుకు వివిధ కుటుంబాలు, స్నేహితులను ఆహ్వానిస్తారు. కానీ, గుజరాత్‌లోని సుర్ఖేడా, సనాడ, అంబల్ గ్రామాలలో నివసిస్తున్న గిరిజన జనాభాలో చాలా ప్రత్యేకమైన వివాహ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ గ్రామాల పెళ్లిళ్లలో వరుడు ఉండాల్సిన అవసరం లేదు. బదులుగా వరుడి పెళ్లికాని సోదరి లేదా కుటుంబంలోని పెళ్లికాని స్త్రీ ఈ వివాహాన్ని నిర్వహిస్తుంది.. ఆమె తన అన్న జీవితానికి తొలి అడుగు వేస్తుంది.

Grooms Sister

ఈ విశిష్ట సంప్రదాయం ప్రకారం, వరుడికి బదులుగా వరుడి పెళ్లికాని సోదరి లేదా వరుడి కుటుంబానికి చెందిన పెళ్లికాని మహిళ ఎవరైనా వివాహ వేడుకకు హాజరవుతారు. సోదరుడి తరపున ఆమె వివాహ వేడుకలను నిర్వహిస్తుంది. సోదరి స్వయంగా వివాహ ఊరేగింపులో పాల్గొంటుంది. తన సోదరుడితో వధువు వివాహం కోసం తమ ఇంటికి తీసుకువెళుతుంది. ముందుగా ఆమె తన సోదరుడికి బదులుగా వధువును వివాహం చేసుకుంటుంది. వరుడు చేయాల్సిన కల్యాణ క్రతువు మంగళసూత్రం కట్టడం, ఏడడుగులు వేయటం అన్ని అతని సోదరి చేస్తుంది. సుర్ఖేడా గ్రామానికి చెందిన కంజిభాయ్ రథ్వా ఈ అరుదైన ఆచారాన్ని వెలుగులోకి తెచ్చారు. సాంప్రదాయకంగా వరుడు చేసే ఆచారాలన్నీ అతని సోదరి స్వయంగా నిర్వహించారు. ఎవరైనా ఈ సంప్రదాయాన్ని పాటించకపోతే వారికేదో అరిష్టం జరుగుతుందని గ్రామంలో నమ్మకం.

సుఖేదా గ్రామ అధిపతి రాంసింగ్‌భాయ్ రథ్వా ఈ సంప్రదాయం ప్రాముఖ్యతను వెల్లడించారు. కొందరు ఈ సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కానీ, వారి వివాహం ఎక్కువ కాలం నిలబడలేదని, వారి కుటుంబ జీవితం సజావుగా సాగలేదని చెప్పారు. ఇంక వారి కుటుంబంలో అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తాయని చెప్పారు. వరుడు తన వివాహానికి భౌతికంగా హాజరు కానప్పటికీ, అతను వరుడి వేషంలో షేర్వాణి, తలపాగా ధరించి, సాంప్రదాయక ఖడ్గాన్ని ధరించి పెళ్లికి రెడీ అవుతాడు. ఓపికగా ఇంటి వద్ద వధువు కోసం వేచి ఉంటాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ నమ్మకం వెనుక కారణం కూడా ఉందంటున్నారు ఇక్కడి స్థానికులు. ఇక్కడి వారి నమ్మకం మేరకు.. ఈ మూడు గ్రామాలకు ఇంటి దైవంగా భావించే దేవుడు బ్రహ్మచారి అని నమ్ముతారు. వారి గౌరవార్థమే.. పెళ్లి సమయంలో వరుడిని ఇంట్లోనే ఉంచుతారు. వంశ దేవత శాపం వరుడిపై పడకూడదని ఇలా చేస్తారట. అబ్బాయి వరుడి వేషంలో ఉంటాడు. కానీ, అతని సోదరి చేతుల మీదుగా వధువుతో వివాహం జరిపిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..