Kerala Doctor: అడిగిన కట్నం ఇవ్వలేదని పెళ్లి ఆపేసిన వరుడి కుటుంబం.. యువ డాక్టర్ ఆత్మహత్య
అయితే, అబ్బాయి కుటుంబం బంగారం, భూమి, బీఎమ్‌డబ్ల్యూ కారు రూపంలో భారీ కట్నాన్ని డిమాండ్ చేశారు. 150 గ్రాముల బంగారం, 15 ఎకరాల భూమి, బీఎండబ్ల్యూ కారును కట్నంగా డిమాండ్ చేసింది రువైస్ కుటుంబం. ఇంత భారీ డిమాండ్‌ను షహానా కుటుంబం తీర్చలేకపోయింది. దీంతో రువైస్ కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది. పెళ్లి రద్దు కావడంతో మనస్తాపం చెంది షహానా ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు ఆరోపించారు. షహానా తన ఆత్మహత్యకు గల కారణాలను డెత్ నోట్ రాసింది.
వరకట్న వేధింపుల కారణంగా ఒక యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న డిమాండ్లను తీర్చలేదంటూ వరుడు పెళ్లికి నిరాకరించడంతో బాధిత యువతి బలవన్మరణానికి పాల్పడింది. కేరళలోని తిరువనంతపురంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వరకట్న వేధింపుల కారణంగా వివాహం రద్దు కావడంతో మనస్తాపానికి గురైన యువ వైద్యురాలు డాక్టర్ షహానా ఆత్మహత్య చేసుకుంది. వరకట్నం డిమాండ్‌ను తీర్చలేక వరుడు పెళ్లికి నిరాకరించడంతో డాక్టర్ షహానా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షహానా కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ చదువుతోంది. గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. దాంతో షహానా తన తల్లి, తోబుట్టువులతో కలిసి నివసించింది.
తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్న సహానా, అదే కాలేజీలో మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్న రువైస్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో వీరు వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే, అబ్బాయి కుటుంబం బంగారం, భూమి, బీఎమ్‌డబ్ల్యూ కారు రూపంలో భారీ కట్నాన్ని డిమాండ్ చేశారు. 150 గ్రాముల బంగారం, 15 ఎకరాల భూమి, బీఎండబ్ల్యూ కారును కట్నంగా డిమాండ్ చేసింది రువైస్ కుటుంబం. ఇంత భారీ డిమాండ్‌ను షహానా కుటుంబం తీర్చలేకపోయింది. దీంతో రువైస్ కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది.
పెళ్లి రద్దు కావడంతో మనస్తాపం చెంది షహానా ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు ఆరోపించారు. షహానా తన ఆత్మహత్యకు గల కారణాలను డెత్ నోట్ రాసింది. షహానా అపార్ట్‌మెంట్‌లో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జరిగిన ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా ఛార్జ్ స్పందించారు. వరకట్న వేధింపుల బాధితురాలు షహానా మృతిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా ఛార్జ్ విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు రువైస్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..