Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టికెట్ లేకుండా రైలులో కూడా ప్రయాణించవచ్చు..! కొత్త రూల్ అమల్లోకి..

ఇకపై రైలు ఎక్కేటప్పుడు చేతిలో టికెట్ లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో భారతీయ రైల్వేకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనలను షేర్ చేసింది . దీని ప్రకారం రైలు ఎక్కే సమయంలో ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేయకున్నా ఇబ్బంది ఉండదు. ఏదైనా ప్రయాణీకుల వెయిటింగ్ లిస్ట్ క్లియర్ కాకపోతే, మీరు TTE వద్దకు వెళ్లి టిక్కెట్‌ను చూపించి ఖాళీగా ఉన్న సీటు గురించి సమాచారాన్ని తెలుసుకుని దానిని కన్ఫామ్‌ చేయించుకోవచ్చు. సీటు ఖాళీగా ఉంటే లేదా ఏ సీటులోనైనా ప్రయాణికులు రాకపోతే టీటీఈ మీకు ఆ బెర్త్ ఇస్తారు.

టికెట్ లేకుండా రైలులో కూడా ప్రయాణించవచ్చు..! కొత్త రూల్ అమల్లోకి..
Trains
Follow us
Jyothi Gadda

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 08, 2023 | 8:41 AM

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను అమలు చేస్తుంది. అంతేకాదు రైళ్లలో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 2.5 కోట్ల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. రైలులో ప్రయాణించాలంటే టికెట్ కొనడం తప్పనిసరి. అందుకోసం రైలు బయలు దేరే చివరి క్షణం వరకు కూడా ప్రయాణికులు టికెట్ కౌంటర్ వద్ద క్యూలైన్లలో నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కొందరు టిక్కెట్లు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో టిక్కెట్లు లేకుండానే రైలు ఎక్కేస్తుంటారు. ఇలా టికెట్ లేకుండా రైలు ఎక్కిన తర్వాత పట్టుబడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. యితే, ఇకపై ఇండియన్ రైల్వేలో ..  రైలు ఎక్కేటప్పుడు చేతిలో టికెట్ లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో భారతీయ రైల్వేకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనలను షేర్ చేసింది . దీని ప్రకారం రైలు ఎక్కే సమయంలో ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేయకున్నా ఇబ్బంది ఉండదు.

కొత్త నిబంధనల ప్రకారం రైలు లోపల టిక్కెట్లు జారీ చేసే సౌకర్యాన్ని కూడా రైల్వే ప్రారంభించింది. ఈ సదుపాయం కింద టికెట్ లేని ప్రయాణికులు టిక్కెట్లు తీసుకోవడానికి TTEని సంప్రదించవచ్చు. చేతిలో టికెట్ లేకపోతే మీరు రైలు ఎక్కిన వెంటనే టీటీఈని సంప్రదించి మీ పరిస్థితిని వారికి తెలియజేయాలి. అప్పుడు మాత్రమే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మీ టికెట్ TTE నుండి పొందవచ్చు.

ఈ సదుపాయం కింద, TTE వద్ద ఒక హ్యాండ్ హోల్డ్ మెషిన్‌ ఉంటుంది. దీని సహాయంతో TTE రైలు లోపల ఉన్న ప్రయాణీకులకు టిక్కెట్‌ లేకపోతే జారీ చేస్తాడు. TTE వద్ద ఉన్న యంత్రం రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సర్వర్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ప్రయాణీకుడు టిక్కెట్‌ను పొందడానికి మెషిన్‌లో పేరు, వారు దిగాల్సిన స్టేషన్‌ నమోదు చేసిన వెంటనే టిక్కెట్‌ను జారీ చేస్తారు. రైలులో అందుబాటులో ఉన్న బెర్త్‌ల గురించిన సమాచారాన్ని ఈ యంత్రం ద్వారా సులభంగా పొందవచ్చు. అయితే, మీరు ముందుగా టిక్కెట్లు కొనకపోతే 250 రూపాయల జరిమానా, మీరు రైలు ఎక్కిన ప్రదేశం నుండి గమ్యస్థానానికి ఛార్జీలు చెల్లించాలని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

ఏదైనా ప్రయాణీకుల వెయిటింగ్ లిస్ట్ క్లియర్ కాకపోతే, మీరు TTE వద్దకు వెళ్లి టిక్కెట్‌ను చూపించి ఖాళీగా ఉన్న సీటు గురించి సమాచారాన్ని తెలుసుకుని దానిని కన్ఫామ్‌ చేయించుకోవచ్చు. సీటు ఖాళీగా ఉంటే లేదా ఏ సీటులోనైనా ప్రయాణికులు రాకపోతే టీటీఈ మీకు ఆ బెర్త్ ఇస్తారు.

UTS, ఇండియన్‌ రైల్వే అధికారిక టికెటింగ్ యాప్, మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..