AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Gochar 2023: ఈ నెల 16న రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ ఐదు రాశులకు లక్కే లక్కు.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..

డిసెంబరు నెలలో కొన్ని గ్రహాల సంచారాలు జరగనున్నాయి. గ్రహాలకధిపతి సూర్యుడితో సహా ఐదు ప్రధాన గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. ప్రత్యక్ష దైవం గ్రహాల రాజు సూర్యుడు ఈ నెల 16న మధ్యాహ్నం 03:47 గంటలకు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్య గమనంలో మార్పుతో 12 రాశులపై ప్రభావం చూపించనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే సూర్యుడు రాశి గమనంలో మార్పు ఏ ఏ రాశులకు శుభాలను తీసుకొస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..

Surya Gochar 2023: ఈ నెల 16న రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ ఐదు రాశులకు లక్కే లక్కు.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
Surya Gochar 2023
Surya Kala
|

Updated on: Dec 08, 2023 | 7:46 AM

Share

నవ గ్రహాలు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాల గమనం.. రాశుల మార్పుతో మానవ జీవితంలో మంచి చెడులు ఏర్పడతాయి. అయితే నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు త్వరగా త్వరగా తమ గమనాన్ని మార్చుకోగా.. శనీశ్వరుడు అత్యంత నెమ్మదికా కదిలే గ్రహం. అయితే డిసెంబరు నెలలో కొన్ని గ్రహాల సంచారాలు జరగనున్నాయి. గ్రహాలకధిపతి సూర్యుడితో సహా ఐదు ప్రధాన గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. ప్రత్యక్ష దైవం గ్రహాల రాజు సూర్యుడు ఈ నెల 16న మధ్యాహ్నం 03:47 గంటలకు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్య గమనంలో మార్పుతో 12 రాశులపై ప్రభావం చూపించనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే సూర్యుడు రాశి గమనంలో మార్పు ఏ ఏ రాశులకు శుభాలను తీసుకొస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..

ధనుస్సు రాశి:  సూర్యుడు ఈ నెల 16న ప్రవేశించనున్నాడు. సూర్యుడి సంచారంతో ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే.. ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారం చేసే వ్యక్తులకు శుభ సమయం. ఏ నిర్ణయం తీసుకున్నా లాభసాటిగా మారుతుంది. ఉద్యోగస్తులకు తమ అధికారుల మద్దతు లభిస్తుంది. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.

మిధున రాశి: ఈ రాశికి చెందిన వారికీ సూర్యుడి సంచారంతో ఆర్ధిక పురోగతి ఉంటుంది. అదే సమయంలో తీసుకునే నిర్ణయాల పట్ల శ్రద్ధ వహించాలి. లేదంటే మిశ్రమ ఫలితాలు పొందుతారు. కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. ఎప్పుడో చేసిన ఋణం తీర్చే ప్రయత్నం చేస్తే.. అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మీన రాశి: ఈ రాశి వారికి సూర్యుడి సంచారం శుభఫలితాలను ఇస్తుంది. మంచి లాభాలను పొందుతారు. అయితే తినే ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల తో సుఖ సంతోషాలతో గడుపుతారు. వ్యాపారస్తులు ఆర్ధిక పురోగతిని సాధిస్తారు. లాభాలను అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై సూర్యుడి గ్రహ సంచార మార్పు అనేక మార్పులు తీసుకుని వస్తుంది. పట్టిందల్లా బంగారం గా మారుతుంది. సంపద పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార, ఉద్యోగస్తులకు శుభ సమయం. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..