Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Utpanna Ekadashi: నేడు ఉత్పన్న ఏకాదశి.. విశిష్టత.. పూజ శుభ సమయం.. పూజ విధానం మీకోసం

హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ధర్మం, అర్థ, కర్మ, మోక్షం అనే నాలుగు విషయాలను పొందడంలో సహాయపడే ఉపవాసంగా పరిగణించబడుతుంది. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని 'ఉత్పన్న ఏకాదశి' అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది.

Utpanna Ekadashi: నేడు ఉత్పన్న ఏకాదశి.. విశిష్టత.. పూజ శుభ సమయం.. పూజ విధానం మీకోసం
Utpanna Ekadashi
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2023 | 6:53 AM

హిందూ మతంలో ఏకాదశి ఉపవాసం అన్ని ఉపవాసాలలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. పురాణ గ్రంధాల్లో ఏకాదశి ఉపవాస విశిష్ట గురించి పేర్కొన్నారు. ఏకాదశి వ్రతాన్ని పాటించడం, లోక రక్షకుడైన విష్ణువును అన్ని నియమ నిష్టలతో పూజించడం ద్వారా చేసిన అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఉత్పన్న ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరి, మరణానంతరం శ్రీవిష్ణువు అనుగ్రహంతో వైకుంఠ లోక ప్రాప్తితో పాటు మోక్షాన్ని కూడా పొందుతాడని విశ్వాసం.

హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ధర్మం, అర్థ, కర్మ, మోక్షం అనే నాలుగు విషయాలను పొందడంలో సహాయపడే ఉపవాసంగా పరిగణించబడుతుంది. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ‘ఉత్పన్న ఏకాదశి’ అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి.

ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు. సప్త మాతృకల్లో ఒక స్వరూపమైన వైష్ణవీ దేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపంలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశి ని ఏకాదశి తిధి జన్మదినంగా భావిస్తారు. ఈ ఏకాదశి రోజున ఏకాదశి మాతను ఆరాధించడంతో పాటుగా విష్ణువును పూజించే ఏ భక్తుడి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని వరం ఇచ్చాడు. అంతేకాదు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా ఉపశమనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

ఉత్పన్న ఏకాదశి 2023 శుభ సమయం

ఉత్పన్న ఏకాదశి ఈరోజు డిసెంబర్ 8వ తేదీ ఉదయం 05:06 గంటలకు ప్రారంభమై రేపు అంటే డిసెంబర్ 9వ తేదీ ఉదయం 06:31 గంటలకు ముగుస్తుంది. ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని డిసెంబర్ 8 , 9 తేదీలలో ఆచరించవచ్చు. మీరు ఈరోజు డిసెంబర్ 8వ తేదీన ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నట్లయితే.. ఉపవాసాన్ని విరమించే సమయం డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 01:01 నుండి 03:20 వరకు ఉంటుంది. మీరు ఈ సమయంలో మీ ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. మీరు డిసెంబర్ 9న ఉపవాసం ఉన్నట్లయితే, ఉపవాసం విరమించే సమయం డిసెంబర్ 10వ తేదీ ఉదయం 07:03 నుండి 07:13 వరకు ఉంటుంది.

ఉత్పన ఏకాదశి పూజా విధానం

  1. ఉత్పన్న ఏకాదశి రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  2. స్నానం చేసిన అనంతరం శ్రీ హరిని పంచామృతంతో పాటు పూలు, దీపం, ధూపం, అక్షతలు, పండ్లు, చందనం, తులసితో పూజించండి.
  3. శ్రీమహావిష్ణువును పూజించిన తరువాత హారతిని ఇవ్వండి.
  4. హారతి ఇచ్చిన తర్వాత కుంకుమతో పూజ చేసి ఉత్పన్న ఏకాదశి కథను వినండి.
  5. కథ విన్న తర్వాత విష్ణువు మంత్రాన్ని ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ జపించండి.
  6. ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ విష్ణు సహస్రనామం పఠించండి.

ఉత్పన్న ఏకాదశి రోజున ఏమి చేయాలంటే

  1. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం చాలా పవిత్రమైనది. ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
  2. శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున ఉపవాసం పాటించండి.
  3. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున, విష్ణువు పూజలో ఖచ్చితంగా తులసిని ఉపయోగించండి. అతనికి తులసిని సమర్పించండి.
  4. ఉత్పన్న ఏకాదశి రోజున సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రోజున విష్ణుమూర్తికి పసుపు పండ్లు, పసుపు  పువ్వులు సమర్పించాలి.
  5. ఉత్పన్న ఏకాదశి రోజున దానధర్మాలు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున పేదవారికి ఆహారం, బట్టలు, డబ్బు మొదలైనవి దానం చేయండి. ఇలా చేయడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.
  6. ఉప్తన్న ఏకాదశి రోజున బ్రహ్మచర్యాన్ని పాటించి మనసు, మాటలను అదుపులో ఉంచుకోవాలి.
  7. ఉత్పన్న ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తి మంత్రాలను పఠించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు సంతోషిస్తాడు.

ఉత్పన్న ఏకాదశి రోజున ఏమి చేయకూడదంటే

  1. ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరినీ దూషించకండి. ఎవరినీ వేధించకండి. ఇలా చేయడం వల్ల శ్రీ హరికి కోపం రావచ్చు.
  2. ఉత్పన్న ఏకాదశి రోజున అన్నం తినడం నిషిద్ధమని భావిస్తారు. అందుకే ఈ రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు. ఇలా చేయడం వల్ల పేదరికం వస్తుంది.
  3. ఉత్పన్న ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి మొదలైన వాటిని తీసుకోవద్దు. ఈ రోజున తామసిక ఆహారాన్ని తినడం మానుకోవాలి.
  4. ఉత్పన్న ఏకాదశి రోజున తులసి ఆకులను తెంపకూడదు. కాబట్టి పూజలో సమర్పించడానికి ఒక రోజు ముందు తులసి ఆకులను తీసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు