Vastu Tips for Car: కారులో ఏ దైవం విగ్రహం ఉంచుకోవాలి.. ప్రయాణంలో సుఖవంతం కోసం చేయాల్సిన చర్యలు ఏమిటంటే..

ప్రతి ఒక్కరూ తమ  బడ్జెట్‌కు అనుగుణంగా కారు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు కారు జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. అందుకనే కారు కొనుగోలు చేసే సమయంలో కారుకి ఉండే  ప్రత్యేక లక్షణాలపై శ్రద్ధ చూపుతారు. అయితే కారుని కొనుగోలు చేసే సమయంలో కొని వాస్తు చిట్కాలను దృష్టిలో ఉంచుకోవాలని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ వాస్తు చిట్కాలు కారు ఉన్న యజమానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఎలాంటి ఇబ్బందిని నివారించవచ్చు.

Vastu Tips for Car: కారులో ఏ దైవం విగ్రహం ఉంచుకోవాలి.. ప్రయాణంలో సుఖవంతం కోసం చేయాల్సిన చర్యలు ఏమిటంటే..
Vastu Tips For Car
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2023 | 1:33 PM

ఇల్లు, కారు కొనుగోలు చేయడం నేటి తరం వారి కల. తమ కలను నెరవేర్చుకోవడానికి ఎంత కష్టమైన పడతారు. అయితే కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే లేదా మీకు ఇప్పటికే కారు ఉంటే, మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు కొందరికి మాత్రమే పరిమితమైన కారు.. నేడు ఇంటికొకటి ఉంది. కారు స్టేటస్ సింబల్ గా మారింది అని చెప్పడంలో తప్పులేదు. ప్రతి ఒక్కరూ తమ  బడ్జెట్‌కు అనుగుణంగా కారు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు కారు జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. అందుకనే కారు కొనుగోలు చేసే సమయంలో కారుకి ఉండే  ప్రత్యేక లక్షణాలపై శ్రద్ధ చూపుతారు. అయితే కారుని కొనుగోలు చేసే సమయంలో కొని వాస్తు చిట్కాలను దృష్టిలో ఉంచుకోవాలని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ వాస్తు చిట్కాలు కారు ఉన్న యజమానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఎలాంటి ఇబ్బందిని నివారించవచ్చు.

సాధారణంగా కారు కొన్న తర్వాత కొన్ని విషయాలను విస్మరిస్తారని జ్యోతిష్కులు చెప్పారు. వాస్తు శాస్త్రం ప్రకారంకారులో కొన్ని ప్రత్యేక వస్తువులను తప్పనిసరిగా ఉంచుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వలన ప్రతికూలత తొలగుతుంది. రాబోయే సంక్షోభం కూడా నివారించబడుతుంది. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. దీని వల్ల మీ కష్టాలు దూరమవుతాయి, జీవితంలో ఆనందం నెలకొంటుంది.

దేవుని విగ్రహాలు: సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ కారులో కొన్ని దేవీ దేవతల చిత్రాలను ఉంచడం కనిపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కారులో గణపతికి సంబంధించిన చిన్న విగ్రహాన్ని ఉంచడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గణేశుడు కేతువుకు సంబంధించినవాడు. కనుక కారులో గణేష్ విగ్రహం ఉంటే మీకు జరిగే ప్రమాదాల సమస్య నివారిస్తుంది. అంతే కాకుండా గాలిలో వేలాడుతున్న హనుమంతుని విగ్రహాన్ని కూడా కారులో ప్రతిష్టించడం శుభప్రదం. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఎదురయ్యే కష్టాలన్నిటినీ దూరం చేస్తాడని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

ఎసెన్షియల్ ఆయిల్: వాస్తు ప్రకారం కారులో చిన్న బాటిల్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంచడం సానుకూలతను సూచిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. దీని స్మెల్ కారులో ప్రయాణిస్తున్నవారు అలసిపోకుండా చేస్తుంది.

తాబేలు బొమ్మ: కారులో చిన్న తాబేలు బొమ్మని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది.

కారులో ఉంచకూడని వస్తువులు

కారులో విరిగిన వస్తువులను ఎప్పుడూ ఉంచవద్దు. కారు కిటికీలు, కార్పెట్ , సీట్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. ఇది మీకు శాంతిని ఇస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు