Betel Leaves: తమలపాకులేని పూజ, శుభకార్యాలు అసంపూర్ణం.. దీనివెనుక ఉన్న పురాణ కథ ఏమిటంటే

పారాయణం, పూజల సమయంలో తమలపాకుల్లో పండ్లు  ఉంచి తాంబూలంగా ఆచారాల ప్రకారం దేవతామూర్తులకు సమర్పిస్తారు. చాలా ప్రదేశాల్లో పూజ సమయంలో తమలపాకుపై కర్పూరం ఉంచి వెలిగిస్తారు. ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. తమలపాకులను పూజలో ఎందుకు ఉపయోగిస్తారు..  దాని ప్రత్యేక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.. 

Betel Leaves: తమలపాకులేని పూజ, శుభకార్యాలు అసంపూర్ణం.. దీనివెనుక ఉన్న పురాణ కథ ఏమిటంటే
Betel Leaf Puja
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2023 | 9:14 PM

హిందూమతంలో దైవ పూజకు ప్రత్యేక స్థానం ఉంది. పూజ సమయంలో ఉపయోగించే ద్రవ్యాలకు విశిష్ట స్థానం ఉంది. పూజ, శుభకార్యాల్లో తమలపాకును సమర్పించడం చాలా పవిత్రమైనదిగా  పరిగణించబడుతుంది. తమలపాకుని పూజలో ఉపయోగించే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా లక్ష్మిదేవి, గణపతి పూజ సహా ఇతర పూజలు , వ్రతాల సమయంలో తమలపాకులను ఉపయోగిస్తారు. తమలపాకులను శుభం, లాభానికి చిహ్నంగా భావిస్తారు. ఏదైనా కారణాల వలన తమలపాకులను పూజలో చేర్చకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. తమలపాకు ప్రాముఖ్యతను తెలియజేసే అనేక పురాణ కథలు ఉన్నాయి.

పారాయణం, పూజల సమయంలో తమలపాకుల్లో పండ్లు  ఉంచి తాంబూలంగా ఆచారాల ప్రకారం దేవతామూర్తులకు సమర్పిస్తారు. చాలా ప్రదేశాల్లో పూజ సమయంలో తమలపాకుపై కర్పూరం ఉంచి వెలిగిస్తారు. ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. తమలపాకులను పూజలో ఎందుకు ఉపయోగిస్తారు..  దాని ప్రత్యేక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

తమలపాకులు సుగంధ స్వభావానికి ప్రసిద్ధి చెందాయి. పూజలో ప్రముఖ స్థానం ఉంది. ఇది స్వచ్ఛతకు చిహ్నమని .. పూజను పూర్తి చేస్తుందని నమ్ముతారు. పూజకు సంబంధించిన అనేక ఆచారాల్లో  తమలపాకులను సమర్పించడం వలన దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. ఈ ఆకుల శక్తివంతమైన ఆకుపచ్చ రంగు జీవితంలో కొత్త ప్రారంభాన్ని, జీవిత పునరుజ్జీవనానికి సంబంధించినది.

ఇవి కూడా చదవండి

తమలపాకులు ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు చిహ్నం

ఐశ్వర్యం, శ్రేయస్సుని ఇచ్చే లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం తమలపాకులను పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తారు. తమలపాకులో ఉన్న స్వాభావిక లక్షణాలు భక్తులకు సానుకూల శక్తిని, దైవిక ఆశీర్వాదాన్ని  ఆకర్షిస్తాయని నమ్ముతారు. ఆరాధనలో ఏకాగ్రత కలిగిస్తుంది. హిందూమతంలో తమలపాకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడిని సూచిస్తాయి. పూజ సమయంలో తమలపాకులను సమర్పించడం అనేది ఈ దైవిక శక్తుల పట్ల భక్తిని వ్యక్తపరిచే సులభమైన మార్గం.. ఆరాధకులు విశ్వ క్రమాన్ని అంగీకరించడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

ప్రాచీన హిందూ గ్రంథం స్కంద పురాణంలో తమలపాకుల గురించి ప్రస్తావించబడింది. పూజలో తమలపాకులను ఉపయోగించడం వెనుక సముద్ర మథనానికి సంబంధించిన కథనాన్ని ప్రస్తావించారు. దేవతలు , రాక్షసులు అమరత్వం కోసం అమృతాన్ని పొందేందుకు సముద్ర మథనం చేసిన సమయంలో దైవిక వస్తువులు ఉద్భవించాయి. వీటిల్లో ఒకటి తమలపాకు. ఈ ఆకు ప్రస్తావన మహాభారతం వంటి ఇతిహాసాల్లో కూడా ప్రస్తావించబడింది. దీని కారణంగా దీనిని హిందూ ఆచారాలలో భాగం చేయడం తప్పనిసరి అని భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..