AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో సుఖ సంతోషాల కోసం కన్నయ్య ధర్మరాజుకి చెప్పిన ఈ వాస్తు నియమాలు పాటించి చూడండి

శ్రీ కృష్ణ భగవానుడు స్వయంగా వాస్తు శాస్త్రంలో జ్ఞాని అని నమ్మకం. అందుకే పాండవుల ప్రథముడు యుధిష్టుడి  పట్టాభిషేకం సమయంలో అతను అనేక వాస్తు నివారణల గురించి చెప్పాడు. అవి ఇంటి నుండి వాస్తు దోషాలను తొలగించి సుఖ సంతోషాలను తీసుకుని వస్తాయి. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పిన వాస్తు పరిహారాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Vastu Tips: ఇంట్లో సుఖ సంతోషాల కోసం కన్నయ్య ధర్మరాజుకి చెప్పిన ఈ వాస్తు నియమాలు పాటించి చూడండి
Vastu Tips For Happiness
Follow us
Surya Kala

|

Updated on: Nov 30, 2023 | 8:40 PM

ఇల్లు, పర్యావరణం మనిషి జీవితంపై లోతైన ప్రభావం చూపుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువును ఏర్పాటు చేయడానికి సరైన దిశ, స్థలం పేర్కొన్నారు. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేస్తే అది ఆ ఇంటి యజమాని జీవితంలో శుభ పరిణామాలను తెస్తుంది. శ్రీ కృష్ణ భగవానుడు స్వయంగా వాస్తు శాస్త్రంలో జ్ఞాని అని నమ్మకం. అందుకే పాండవుల ప్రథముడు యుధిష్టుడి  పట్టాభిషేకం సమయంలో అతను అనేక వాస్తు నివారణల గురించి చెప్పాడు. అవి ఇంటి నుండి వాస్తు దోషాలను తొలగించి సుఖ సంతోషాలను తీసుకుని వస్తాయి. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పిన వాస్తు పరిహారాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

ఆవు నెయ్యి : శ్రీ కృష్ణుడి ప్రకారం ఆవు నెయ్యిని ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం. ఇది ఇంటిని స్వచ్ఛంగా ,  సుసంపన్నంగా ఉంచుతుంది. ఆవు నెయ్యి దీపం వెలిగించిన ఇంట్లో సకల పాపాలు నశించి జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. దీంతో కోరికలన్నీ కూడా త్వరలో నెరవేరుతాయి.

తేనె: శ్రీ కృష్ణుడి ప్రకారం ఇంట్లో తేనె ఉంచడం చాలా శ్రేయస్కరం. తేనె మానవ ఆత్మను శుద్ధి చేస్తుంది. అందువల్ల హిందూ మతంలో పూజ కోసం ఇంట్లో తేనె ఉంచాలని సూచిస్తారు. ఆరోగ్యం ప్రదాయనిగా తేనెను సూచిస్తారు.

ఇవి కూడా చదవండి

గంధం: శ్రీ కృష్ణుడి ప్రకారం చందనం ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. వీలైతే ఇంటి దగ్గర గంధపు చెట్టును పెంచండి. ఇది ఇంటి నుండి అన్ని రకాల వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఎల్లప్పుడూ సానుకూలతను తీసుకొస్తుంది. కావాలంటే చందనపు ముక్కను ఇంట్లో ఉంచుకోవడం శుభ ఫలితాలను తీసుకొస్తుందని విశ్వాసం.

సరస్వతీ దేవి విగ్రహం:  బ్రహ్మ సతీమణి సరస్వతి జ్ఞానానికి ప్రతీక. చుదువుల తల్లి. ఇంట్లో వీణ లేదా సరస్వతి తల్లి విగ్రహాన్ని ఉంచినట్లయితే అది కుటుంబ సభ్యుల తెలివి , జ్ఞానాన్ని పెంచుతుంది. అందుచేత ఇంట్లో సరస్వతీ అమ్మవారిని రోజూ పూజించండి.

నీరు: శ్రీ కృష్ణుడు సరైన దిశ, నీటిని ఏర్పాటు చేసే ప్రదేశం గురించి కూడా చెప్పాడు. ఇంట్లో నీటి వ్యవస్థ ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశ నీటికి ఉత్తమ దిశగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు