Kaala Bhairava Jayanti: శత్రువుల నుంచి ఉపశమనం కోసం కాలభైరవుడిని ఇలా పూజించండి .. కాలాష్టమి ప్రాముఖ్యత ఏమిటంటే
హిందూ మత విశ్వాసాల ప్రకారం శివుని ఉగ్రరూపాన్ని కాలభైరవుడు అంటారు. భయాన్ని పోగొట్టే భగవంతుని స్వరూపం ఇది. ప్రతి ఒక్కరూ తమ భయాందోళనలను, శత్రువుల నుంచి రక్షణ కోసం భక్తులు కాల భైరవ జయంతి రోజున నిర్మల హృదయంతో పూజించి తమ భయాలను, శత్రువులను పోగొట్టుకుంటారు. కాలాష్టమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా మీ ఇంటిలోని పూజ గదిలో శివుని ముందు దీపం వెలిగించి పూజించండి. అనంతరం పూజలో బిల్వ పత్రంపై చందనంతో ఓం నమః శివయ అని వ్రాసి శివలింగానికి సమర్పించండి.
లయకారుడైన శివయ్య అవతారాల్లో ఒకటి కాలభైరవ స్వామి. శత్రు భయం నుంచి విముక్తి పొందడానికి కాల భైరవ జయంతిని హిందువులు జరుపుకుంటారు. ఆలయాల్లో కాల భైరవుని ప్రత్యేక పూజలు చేస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం కాల భైరవుడిని పూర్తి భక్తితో, ఆచారాలతో పూజించడం ద్వారా శత్రు భయం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పబడింది. అంతేకాదు భక్తి శ్రద్దలతో పూజించిన వ్యక్తి అంతర్గత శాంతిని పొందుతాడు. జీవితంలో ఏర్పడే సమస్యలను తొలగించమని భక్తులు కాల భైరవుడిని పూజిస్తారు.
అంతేకాదు కాల భైరవుడిని పూజించడం ద్వారా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగబోతుంటే అది కూడా నివారించబడుతుంది. అలాగే కాల భైరవుని ఆశీస్సులు మొత్తం కుటుంబంపై ఉంటాయి. ఈ రోజు కాలాష్టమి పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
కాల భైరవ జయంతి ప్రాముఖ్యత?
హిందూ మత విశ్వాసాల ప్రకారం శివుని ఉగ్రరూపాన్ని కాలభైరవుడు అంటారు. భయాన్ని పోగొట్టే భగవంతుని స్వరూపం ఇది. ప్రతి ఒక్కరూ తమ భయాందోళనలను, శత్రువుల నుంచి రక్షణ కోసం భక్తులు కాల భైరవ జయంతి రోజున నిర్మల హృదయంతో పూజించి తమ భయాలను, శత్రువులను పోగొట్టుకుంటారు.
కాల భైరవుడిని ఎలా పూజించాలంటే
కాలాష్టమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా మీ ఇంటిలోని పూజ గదిలో శివుని ముందు దీపం వెలిగించి పూజించండి. అనంతరం పూజలో బిల్వ పత్రంపై చందనంతో ఓం నమః శివయ అని వ్రాసి శివలింగానికి సమర్పించండి. సాయంత్రం కాల భైరవుడిని పూజిస్తారు. కాబట్టి సాయంత్రం ఆలయానికి వెళ్లి కాల భైరవుని విగ్రహం ముందు నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించండి. కాల భైరవుడుని ఇలా పూజించిన తరువాత త్వరగా ప్రసన్నుడవుతాడు. తనని పూజించిన భక్తుడి అన్ని కోరికలను తీరుస్తాడని చెబుతారు.
నైవేద్యంగా ఏమి అందించాలంటే
ఈ ప్రత్యేక రోజున కాలభైరవుడికి తమలపాకులు, కొబ్బరి, ఏదైనా స్వీట్స్ ను నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే దేవుడికి పూలు, పండ్లు సమర్పించండి. అనంతరం కాలభైరవునికి హారతినివ్వండి. అనంతరం ఆరాధన సమయంలో ఏదైనా తప్పు జరిగితే హృదయపూర్వకంగా క్షమించమని క్షమాపణలు కోరండి. ఎవరైతే నిర్మల హృదయంతో ఆరాధిస్తారో వారిపై ఆ భైరవుడు, మహాదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు