Kusha Grass: ఈ గడ్డి పూజాదికార్యక్రమాల్లో అత్యంత పవిత్రమైంది.. ఇంట్లో సుఖసంతోషాలు తెస్తుంది..
దర్భ అనేది ఒక రకమైన గడ్డి మొక్క.. దీనిని కుశదర్భ అని కూడా అంటారు. దర్భ లేని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ గడ్డి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి పవిత్రమైన పనిలో దీనిని ఉపయోగిస్తారు. హిందూ మతంలో జరిగే యజ్ఞ, యాగాలలో, పూజ వంటి ఆచారాలలో ఉపయోగిస్తారు. ఈ రోజు మనం దర్భ విశిష్టత గురించి తెలుసుకుందాం.. శ్రాద్ధం, తర్పణం, గ్రహణం సమయంలో కలిగే దుష్ప్రభావాలు దర్భ వినియోగం వలన తగ్గుతాయి.
హిందూ సంప్రదాయంలో వృక్ష, జంతువులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. వృక్ష సంపదలో ఒకటైన దర్భను కూడా హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. దర్భ అనేది ఒక రకమైన గడ్డి మొక్క.. దీనిని కుశదర్భ అని కూడా అంటారు. దర్భ లేని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ గడ్డి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి పవిత్రమైన పనిలో దీనిని ఉపయోగిస్తారు. హిందూ మతంలో జరిగే యజ్ఞ, యాగాలలో, పూజ వంటి ఆచారాలలో ఉపయోగిస్తారు. ఈ రోజు మనం దర్భ విశిష్టత గురించి తెలుసుకుందాం..
శ్రాద్ధం, తర్పణం, గ్రహణం సమయంలో కలిగే దుష్ప్రభావాలు దర్భ వినియోగం వలన తగ్గుతాయి. కుశదర్భను ఎర్రటి గుడ్డలో చుట్టి ఉంచడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది. అందువల్ల ఈ గడ్డిని పూజకు అత్యంత పవిత్రంగా భావిస్తారు.
దర్భకు మతపరమైన ప్రాముఖ్యత
పూజ ఏదైనా సరే దర్భను ఉపయోగిస్తారు. ఏదైనా మతపరమైన పూజలో దర్భతో చేసిన ఆసనాన్ని వినియోగిస్తారు. కుశ గడ్డితో చేసిన ఆసనంపై కూర్చొని మంత్రాలు పఠించడం ద్వారా, మంత్రాలు అత్యంత ఫలవంతం అవుతాయని విశ్వాసం. అంతేకాకుండా కలుషితమైన వాతావరణాన్ని శుద్ధి చేయడానికి కుష్ గడ్డిని కూడా ఉపయోగిస్తారు.
దర్భ ప్రాముఖ్యత
దర్భని శ్రద్ధ, తర్పణం మొదలైన హిందూ మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. హిందువుల అనేక మత పరమైన కార్యక్రమాలలోతప్పనిసరిగా దర్భను ఉపయోగిస్తారు. దర్భ లేని ఏ పూజ అయినా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. దర్భ గడ్డితో తీసిన నూనెను ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు.
దర్భ తో తయారు చేసిన ఉంగరం
కుశ గడ్డితో ఉంగరాన్ని తయారు చేసి ఉంగరపు వేలికి ధరించడం ద్వారా సూర్య భగవానుడి అనుగ్రహం మనకు లభిస్తుందని నమ్ముతారు. దీని వల్ల మనకు కీర్తి, కీర్తి లభిస్తాయని విశ్వాసం. అలాగే చేతిలో దర్భను పట్టుకున్నట్లయితే చేడు దృష్టిని పడదని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు