Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips for Moon: మానసిక ఇబ్బందులా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడేమో చెక్ చేసుకోండి.. నివారణ చర్యలు ఏమిటంటే..

వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని పితృ గ్రహంగా పరిగణిస్తే, చంద్రుడిని స్త్రీ గ్రహంగా పరిగణిస్తారు. చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలతో పాటు కర్కాటక రాశికి అధిపతి. వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు మనస్సు, మనోబలం, ఎడమ కన్ను, ఛాతీకి బాధ్యత వహించే గ్రహం. ఎవరిజాతకంలోనైనా ఆరోహణ ఇంట్లో చంద్రుడు ఉంటే.. ఆ వ్యక్తి చాలా అందంగా, ఊహాత్మకంగా, భావోద్వేగంగా, సున్నితమైన వ్యక్తిగా ధైర్యంగా ఉంటాడు.

Astro Tips for Moon: మానసిక ఇబ్బందులా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడేమో చెక్ చేసుకోండి.. నివారణ చర్యలు ఏమిటంటే..
Astro Tips For Moon
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2023 | 3:30 PM

వేద జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాల్లో చంద్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత.. ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిషశాస్త్రంలో  వ్యక్తి జాతకంలో తారాబలం బట్టి భవిష్యత్ ఉంటుందని విశ్వాసం. జాతకంలో చంద్రుని స్థానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక వ్యక్తి పుట్టిన సమయంలో చంద్రుడు ఉండే రాశి.. అది చంద్రుని చిహ్నంగా పిలువబడుతుంది. సూర్యుని తర్వాత చంద్రుడు రెండవ గ్రహం. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుని ప్రాముఖ్యత ఏమిటి? జ్యోతిష్య గణనలు ఎలా జరుగుతాయో వివరంగా తెలుసుకుందాం..

మొత్తం 9 గ్రహాల్లో చంద్రుని గమనం అత్యంత వేగవంతమైనదని జ్యోతిష్యులు చెప్పారు. చంద్రుడు ఏ రాశిలో నైనా అతి తక్కువ కాలం మాత్రమే సంచరిస్తాడు. చంద్రుడు ఒక రాశి నుండి మరో రాశికి తన ప్రయాణాన్ని సుమారు రెండున్నర రోజుల్లో పూర్తి చేస్తాడు. వేద జ్యోతిషశాస్త్రంలో వ్యక్తి జాతకం చంద్రుని గమనం  ఆధారంగా లెక్కించబడుతుంది.

వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని పితృ గ్రహంగా పరిగణిస్తే, చంద్రుడిని స్త్రీ గ్రహంగా పరిగణిస్తారు. చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలతో పాటు కర్కాటక రాశికి అధిపతి. వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు మనస్సు, మనోబలం, ఎడమ కన్ను, ఛాతీకి బాధ్యత వహించే గ్రహం. ఎవరిజాతకంలోనైనా ఆరోహణ ఇంట్లో చంద్రుడు ఉంటే.. ఆ వ్యక్తి చాలా అందంగా, ఊహాత్మకంగా, భావోద్వేగంగా, సున్నితమైన వ్యక్తిగా ధైర్యంగా ఉంటాడు.

ఇవి కూడా చదవండి

జాతకంలో చంద్రుని ప్రభావం

జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నప్పుడు.. వ్యక్తి మానసికంగా బలంగా, సంతోషంగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తులు తల్లికి దగ్గరగా ఉంటారు. మరో వైపు ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి మానసికంగా బలహీనంగా , మతిమరుపుతో ఉంటాడు. చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తరచుగా కష్టలో ఉంటారు. అంతేకాదు కష్ట సమయాల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరి జాతకంలో చంద్రుడు.. దుష్ట గ్రహం ద్వారా బాధించబడుతుంటే ఆ వ్యక్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాణ్ణి చూపిస్తుంది.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

  1. చంద్రుడు తెలుపు రంగుకి చిహ్నం ముత్యం చంద్ర గ్రహానికి ప్రతీకగా చెప్పబడింది.
  2. చంద్రుడి దోష నివారణకు సోమవారం ఉపవాసం ఉండడం శుభఫలితం ఇస్తుంది.
  3. చిటికిన వేలికి వెండి ఉంగరంలో ముత్యాన్ని ధరించడం మంచిది. అంతే కాకుండా చంద్రునికి సంబంధించిన మంత్రాలను జపించాలి.
  4. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుని మహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది.
  5. చంద్రుడు నీటి మూలకానికి దేవుడు. సోమవారం చంద్రదేవునికి అంకితం. శివుడు చంద్రునికి అధిపతి.
  6. చంద్రమ్మ ఋషి అత్రి మహర్షి తల్లి అనుసూయల సంతానం. చంద్రునికి పదహారు దశలు ఉన్నాయి.  వాయువ్య దిశకు అధిపతిగా పరిగణించబడ్డాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు