AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: కొత్త ఏడాదిపై బాబా వంగా భవిష్యవాణి.. అగ్ర రాజ్య అధినేత హత్య, యూరప్ లో ఉగ్రదాడులతో సహా అనేక ప్రళయాలు

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2024లో అడుగు పెట్టబోతున్నాం..  2024లో ఏం జరుగబోతుందో నోస్ట్రాడమస్ మహిళగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చెప్పిన భవిష్యవాణిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. మానవ జీవితం, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను ఆమె అంచనా వేశారు. 5079 నాటికి భవిష్యత్తు వరకూ బాబా వంగా అంచనా వేశారని నమ్మకం. బాబా వంగా అభిప్రాయం ప్రకారం. 2024 లో కూడా ప్రపంచం  అనేక విషాద ఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. 

Baba Vanga: కొత్త ఏడాదిపై బాబా వంగా భవిష్యవాణి.. అగ్ర రాజ్య అధినేత హత్య, యూరప్ లో ఉగ్రదాడులతో సహా అనేక ప్రళయాలు
Baba Vanga
Surya Kala
|

Updated on: Nov 28, 2023 | 7:19 PM

Share

వాస్తవానికి మనుషులు భవిష్యత్ లో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా చూడలేరు.. అయితే ఇలా జరగవచ్చు అంటూ ఊహిస్తారు. అయితే వీరి అంచనాలు మాత్రం ఖచ్చితంగా నిజం అవుతాయనే నమ్మకం ఉండదు. కానీ ప్రపంచంలో కొందరు వ్యక్తులు మాత్రం భవిష్యత్ ను ఊహించి చెప్పిన విషయాలు కనుల ముందు జరుగుతూ వారి అంచనాలు నిజమై కనుల ముందు నిలుస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా వెంటనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, బాబా వంగా వంటి వారిని తలచుకుంటారు. వీరి అంచనాలు ఇప్పటికే అనేక విషయాల్లో నిజం అయ్యాయి. బాబా వంగా జీవించి లేకపోయినా తరచుగా ఆమె చెప్పిన అంచనాలు వార్తల్లో నిలుస్తుంటాయి.

వంగా చెప్పిన భవిష్యవాణి 85 శాతం వరకు కరెక్ట్‌గా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2024లో అడుగు పెట్టబోతున్నాం..  2024లో ఏం జరుగబోతుందో నోస్ట్రాడమస్ మహిళగా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా చెప్పిన భవిష్యవాణిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. మానవ జీవితం, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలను ఆమె అంచనా వేశారు. 5079 నాటికి భవిష్యత్తు వరకూ బాబా వంగా అంచనా వేశారని నమ్మకం. బాబా వంగా అభిప్రాయం ప్రకారం. 2024 లో కూడా ప్రపంచం  అనేక విషాద ఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

మిర్రర్ నివేదిక ప్రకారం బాబా వంగా తన మరణాన్ని మాత్రమే కాదు 9/11 ఉగ్రదాడుల సహా అనేక సంఘటనలు ఊహించారు. బల్గేరియాకు చెందిన బాబా వెంగా అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా .  1996 లో 84 సంవత్సరాల వయస్సులో వంగా మరణించారు.

ఇవి కూడా చదవండి

ఈ అంచనాలు నిజమయ్యాయి

1980లో బాబా వంగా రష్యాలోని కుర్స్క్ నగరంలో ఒక భయంకరమైన సంఘటనను ఊహించినట్లు పేర్కొన్నారు. నీటి అడుగున ఒక సంఘటన జరుగుతుందని.. అప్పుడు ప్రపంచం మొత్తం ఏడుస్తుందని  పేర్కొన్నారు. ఆగస్టు 2000లో ఈ అంచనా నిజమైందని చెబుతున్నారు. నగరానికి సమీపంలో అణు జలాంతర్గామి మునిగిపోవడంతో మొత్తం 188 మంది సిబ్బంది మరణించారు. అంతేకాదు 1989 సంవత్సరంలో 9/11 దాడుల గురించి కూడా ఊహించారు. ‘అమెరికా ఉష్ట్ర పక్షులచే దాడి చేయబడుతుందని అందులో కవలలు పడిపోతారని చెప్పారు. పొదల్లో తోడేళ్లు అరుస్తుంటాయి.. అమాయకులు రక్తం కారుతుంటుంది. స్టీల్ బర్డ్స్ అంటే దాడికి ఉపయోగించిన విమానాలను ఉద్దేశించినట్లు చెబుతున్నారు.

2024 అంచనాలు ఏమిటి?

వ్లాదిమిర్ పుతిన్ హత్య

బాబా వెంగా 2024 కోసం కొన్ని నమ్మశక్యం కాని భయానక అంచనాలు చేసారు. ఆస్ట్రోఫేమ్ ప్రకారం 2024 సంవత్సరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య గావించడబడతాడని .. అది కూడా తన దేశానికి చెందిన ఎవరైనా హత్య చేస్తారని బాబా వంగా పేర్కొన్నారు.

తీవ్రవాద దాడులు

2024లో యూరప్‌లో ఉగ్రవాదులు దాడి చేస్తారని కూడా జోస్యం చెప్పారు.

జీవ దాడులు

వచ్చే ఏడాది ‘పెద్ద దేశం’ బయోలాజికల్ ఆయుధాలను పరీక్షిస్తుందని లేదా దాడి చేస్తుందని బాబా వెంగా పేర్కొన్నారు.

భారీ ఆర్థిక సంక్షోభం

వచ్చే ఏడాది పెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని బాబా పేర్కొన్నారు. మరి ఈ అంచనాల్లో ఏది నిజం అవుతుందో వేచి చూడాలి మరి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us