AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivaha Panchami: ఈ ఏడాది వివాహ పంచమి ఎప్పుడో తెలుసా..! ఈ రోజన ఏ తల్లిదండ్రి తన కూతురికి పెళ్లి ఎందుకు చేయరంటే

హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు, తల్లి సీత వివాహ బంధంలో ముడిపడి ఉన్నారు. ఈ రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు. హిందూ మతం ప్రకారం ఈ రోజున రాముడు తల్లి సీతను వివాహం చేసుకున్నాడు. రామయ్య సకలగుణాభిరాముడు. అయినప్పటికీ రామయ్యను వివాహం చేసుకున్న తరువాత  సీత తన జీవితంలో చాలా బాధలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ రోజున ప్రజలు తమ కుమార్తెలకు వివాహం చేయడానికి వెనుకాడటానికి ఇదే కారణం.

Vivaha Panchami: ఈ ఏడాది వివాహ పంచమి ఎప్పుడో తెలుసా..! ఈ రోజన ఏ తల్లిదండ్రి తన కూతురికి పెళ్లి ఎందుకు చేయరంటే
Vivaha Panchami
Surya Kala
|

Updated on: Dec 01, 2023 | 3:17 PM

Share

హిందువులకు ఆరాధ్య దైవం శ్రీరాముడు.. ఆదర్శ దంపతులు సీతారాములు. రామయ్య సీతమ్మను కళ్యాణం జరుపుకున్న రోజున (వివాహ వార్షికోత్సవాన్ని) వివాహ పంచమిగా జరుపుకుంటారు. రాముడు, సీత వివాహం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరిగిందని.. అందుకే ఈ తేదీని వివాహ పంచమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం వివాహ పంచమి రోజున శ్రీరాముడు సీతదేవిల వివాహ వార్షికోత్సవంగా  జరుపుకుంటారు

ఈ సంవత్సరం వివాహ పంచమి డిసెంబర్ 17, 2023 ఆదివారం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సీతాదేవి మెట్టినిల్లు అయోధ్యలో పుట్టినిల్లు నేపాల్‌లో ప్రత్యేక కార్యక్రమాలను భారీ సంఖ్యలో పూజలను, ఆచారాలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజు సీతా రాముల ఆరాధనకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే వివాహం వంటి శుభకార్యాలను నిర్వహించడానికి ఈ రోజు పవిత్రమైనదిగా పరిగణించబడదు.

వివాహ పంచమి శుభ సమయం

హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి డిసెంబర్ 16వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ 17వ తేదీన సాయంత్రం 5.33 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం వివాహ పంచమిని 17 డిసెంబర్ 2023న మాత్రమే జరుపుకుంటారు. ఈ రోజు పూజకు మూడు శుభ ముహూర్తాలు ఉన్నాయి. పూజకు అత్యంత అనుకూలమైన సమయం ఉదయం 8:24 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. మధ్యాహ్నం 1:34 నుండి 2:52 వరకు శుభ సమయం. దీని తరువాత, సాయంత్రం 05:02 నుండి 10:34 వరకు శుభ సమయం.

ఇవి కూడా చదవండి

వివాహ పంచమి నాడు వివాహం ఎందుకు జరుపుకోరంటే

దేవుత్తని ఏకాదశి ప్రారంభం నుండి శుభ కార్యక్రమాలపై అన్ని ఆంక్షలు ముగుస్తాయి. వివాహ పంచమి అనంతరం ప్రజలు శుభ ముహూర్తాలను చూసి వివాహం చేసుకోవచ్చు. వివాహ పంచమి రోజున వివాహం అశుభమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహ పంచమి రోజు వివాహం వంటి శుభకార్యాలకు మంచిది కాదు. ఎవరి జాతకంలోనైనా గ్రహాల స్థితి బాగున్నప్పటికీ ఈ రోజున వివాహాలను నిర్వహించారు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు, తల్లి సీత వివాహ బంధంలో ముడిపడి ఉన్నారు. ఈ రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు. హిందూ మతం ప్రకారం ఈ రోజున రాముడు తల్లి సీతను వివాహం చేసుకున్నాడు. రామయ్య సకలగుణాభిరాముడు. అయినప్పటికీ రామయ్యను వివాహం చేసుకున్న తరువాత  సీత తన జీవితంలో చాలా బాధలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ రోజున ప్రజలు తమ కుమార్తెలకు వివాహం చేయడానికి వెనుకాడటానికి ఇదే కారణం.

హిందూ మతపరమైన కారణం

హిందూ మతంలో వివాహ పంచమి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సీతను రామయ్య వివాహం చేసుకున్న తర్వాత జీవితంలో చాలా కష్టాలను భరించాల్సి వచ్చింది. 14 సంవత్సరాల వనవాసం వంటి అనేక సంఘటనల తరువాత శ్రీరాముడు కూడా రావణుడిని చంపి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత సీతను విడిచిపెట్టవలసి వచ్చింది. అంతేకాదు సీతదేవి అగ్ని పరీక్షకు గురికావలసి వచ్చింది. ఈ కారణాల వల్ల  ప్రజలు ఈ రోజున తమ కుమార్తెలకు వివాహం చేయకూడదని తల్లిదండ్రులు భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు