Tirumala: టీటీడీకి రూ.5 కోట్ల విలువైన విద్యుత్ గాలి మర విరాళం.. 800 కిలోవాట్‌ల విద్యుత్ ఉత్పత్తి
తిరుమల జిఎన్‌సి ప్రాంతంలో గాలి మర ఏర్పాట్లను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఏపీ ఎస్ఇబి నుండి అనుమతులు వచ్చిన తరువాత టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఈ విద్యుత్ గాలిమర ద్వారా ఏడాదికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని వలన ప్రతి ఏడాది టీటీడీకి రూ.కోటి వరకు ఆదా అవుతుంది.
తిరుమలలో విద్యుత్ అవసరాల కోసం టీటీడీకి రూ.5 కోట్ల విలువైన గాలిమర విరాళంగా ఇచ్చింది. ముంబైకి చెందిన ఒక కంపెనీ. విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్‌ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమల జిఎన్‌సి ప్రాంతంలో గాలి మర ఏర్పాట్లను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఏపీ ఎస్ఇబి నుండి అనుమతులు వచ్చిన తరువాత టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
ఈ విద్యుత్ గాలిమర ద్వారా ఏడాదికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని వలన ప్రతి ఏడాది టీటీడీకి రూ.కోటి వరకు ఆదా అవుతుంది. ఇప్పటికే టీటీడీ అవసరాలకు 15 ఏళ్ల క్రితమే ఇదే కంపెనీ 1.03 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు గాలి మర్లను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీనే చూసుకుంటోంది. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న 0.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమర నిర్వహణను కూడా ఇదే కంపెనీ చేపట్టనుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..