AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru: కాన్వొకేషన్‌ ఫంక్షన్‌లో విషాద ఘటన .. MBBS పట్టా తీసుకున్న కొన్ని క్షణాలకే పాము కాటుతో స్టూడెంట్ మృతి

బెంగళూరు సమీపంలోని తుమకూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 21 ఏళ్ల వైద్య విద్యార్థి ఆదిత్ బాలకృష్ణన్ తన స్నాతకోత్సవ వేడుక ముగిసిన కొద్దిసేపటికే పాముకాటుతో మరణించాడు. కాన్వకేషన్ నుంచి తిరిగి వస్తుండగా ఆదిత్ ను ఓ విషపూరితమైన పాము కాటు వేసింది. ఇంటికి వచ్చిన ఆదిత్ ఇంట్లోనే   కుప్పకూలిపోయాడు, దీంతో ఆదిత్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోర్ట్ మార్టం రిపోర్ట్ లో అతని రక్త నమూనాల్లో విషం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. త్రిసూర్ నుండి   ఆదిత్ కుటుంబం ఇప్పటికే రాగా ఇటలీ లో ఉన్న ఆదిత్ తండ్రి అంత్యక్రియల కోసం వస్తాడని వేచి ఉన్నారు.

Bengaluru: కాన్వొకేషన్‌ ఫంక్షన్‌లో విషాద ఘటన .. MBBS పట్టా తీసుకున్న కొన్ని క్షణాలకే పాము కాటుతో స్టూడెంట్ మృతి
Mbbs Student Aadith
Surya Kala
|

Updated on: Dec 01, 2023 | 2:52 PM

Share

జీవితం క్షణ భంగురం అని పెద్దలు చెప్పిన మాటలు ఒకొక్కసారి కొన్ని సంఘటనలు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. పది మందికి వైద్యం అందించి జీవితాన్ని ఇవ్వాలని ఎన్నో కలలు కంటూ ఎంబీబీఎస్ చదివిన ఓ యువకుడు ఆ కల తీరే సమయంలో విషపూరిమైన పాము కట్టుకుని గురై మరణించాడు. ఆనందంగా ఎంబిబిఎస్ డిగ్రీ పట్టా అందుకున్న వైద్య విద్యార్థికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. కన్న తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చాడు. ఎంబిబిఎస్ డిగ్రీ పట్టాపుచ్చుకున్న 21 ఏళ్ల వైద్య విద్యార్థి బుధవారం స్నాతకోత్సవ వేడుక జరిగిన కొన్ని గంటలకే పాముకాటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరుకు 80 కిలోమీటర్ల దూరంలోని తుమకూరు శివార్లలోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ (SSMC) క్యాంపస్‌లో ఈ విషాద ఘటన జరిగింది. బాధితుడిని కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఆదిత్ బాలకృష్ణన్‌గా గుర్తించారు. శ్రీ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యార్థి అయిన ఆదిత్ కాన్వకేషన్ నుంచి తిరిగి వస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో  విషపూరితమైన కాటుకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

ఆదిత్ ను అతని గదికి సమీపంలోని పార్కింగ్ స్థలంలో పాము కాటు వేసింది. ఈ సంఘటన సమయంలో అతని తల్లి, ఇతర బంధువులు అతనితో ఉన్నారు, అయినప్పటికీ  ఆదిత్ ను పాము కరచినట్లు ఎవరూ గుర్తించలేదు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆదిత్ శరీరం అంతా విషపూరితమై ఇంట్లో కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించాడని  తుమకూరుకు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. బాధితుడి శరీరంపై పాముకాటు గుర్తులు కనిపించగా.. శవపరీక్షలో అతని రక్త నమూనాలలో విషం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

ఇవి కూడా చదవండి

శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ లో జరిగిన వార్షిక స్నాతకోత్సవానికి కాంగ్రెస్ పార్లమెంటేరియన్ శశి థరూర్, SAHE ఛాన్సలర్, హోం మంత్రి జి పరమేశ్వర హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో ఆదిత్‌కు MBBS పట్టా  అందించారు. ఆదిత్ మృతిపై  ఎస్‌ఎస్‌ఎంసి వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రభాకర జిఎన్‌ మాట్లాడుతూ.. ఆదిత్‌ మంచి విద్యార్థి అని, సమయానికి ఆసుపత్రికి చేరుకోలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆదిత్ కు  నివాళులర్పించేందుకు గురువారం కళాశాలలో సంతాప సభ నిర్వహించామ చెప్పారు,

కాన్వొకేషన్‌కు హాజరయ్యేందుకు త్రిసూర్ నుంచి వచ్చిన అదిత్ తల్లి, బంధువులు ఆదిత్ మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటలీ లో ఉన్న ఆదిత్ తండ్రి అంత్యక్రియల కోసం వస్తాడని వేచి ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..