Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Fraud: రూ.113 రీఫండ్ కోసం రూ.4.9 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్.. క్యాబ్ కస్టమర్ పేరుతో టోకరా..

ఢిల్లీలో డాక్టర్ గా పనిచేస్తున్నడు ప్రదీప్ చౌదరి. ఒక పని నిమిత్తం సర్వీస్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న సమయంలో తనకి 205 రూపాయలు చార్జి చూపించింది.. అయితే ఆ రైడ్ ముగియగానే 205 రూపాయలకు బదులు 318 రూపాయలు ఛార్జి చూపించింది.. బాధితుడి వాలెట్ నుండి 318 రూపాయలు డెబిట్ అయిపోయాయి. దీంతో క్యాప్ డ్రైవర్ ని తన డబ్బులు తనకు రీఫండ్ చేయాల్సిందిగా బాధితుడు డ్రైవర్ ను కోరాడు.

Digital Fraud: రూ.113 రీఫండ్ కోసం రూ.4.9 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్.. క్యాబ్ కస్టమర్ పేరుతో టోకరా..
Digital Fraud In Delhi
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Surya Kala

Updated on: Nov 21, 2023 | 4:15 PM

సైబర్ నేరగాళ్లకు గూగుల్ ఒక ఆస్త్రంగా మారిపోయింది. ముఖ్యంగా గూగుల్ లో కస్టమర్ కేర్ నంబర్ పేరుతో అనేక మంది సైబర్ నేరగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఒక విభాగానికి సంబంధించిన కస్టమర్ కేర్ పేరుతో నమోదు చేసుకోవడంతో బాధితుడు ఆ ఫోన్ నెంబర్ కొట్టగానే ట్రూ కాలర్ లో సంబంధిత సంస్థ పేరు చూపిస్తుంది. ఇదే తరహాలో మోసపోయిన ఒక డాక్టర్ 4.9 లక్షలు రూపాయలు పోగొట్టుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. అది కూడా 113 రూపాయలు రిఫండ్ కోసం ప్రయత్నించిన డాక్టర్ గూగుల్ లో కస్టమర్ కేర్ నెంబర్ ను నమ్ముకుని 4.9 లక్షల రూపాయల నగదు పోగొట్టుకున్నాడు.

ఢిల్లీలో డాక్టర్ గా పనిచేస్తున్నడు ప్రదీప్ చౌదరి. ఒక పని నిమిత్తం సర్వీస్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న సమయంలో తనకి 205 రూపాయలు చార్జి చూపించింది.. అయితే ఆ రైడ్ ముగియగానే 205 రూపాయలకు బదులు 318 రూపాయలు ఛార్జి చూపించింది.. బాధితుడి వాలెట్ నుండి 318 రూపాయలు డెబిట్ అయిపోయాయి. దీంతో క్యాప్ డ్రైవర్ ని తన డబ్బులు తనకు రీఫండ్ చేయాల్సిందిగా బాధితుడు డ్రైవర్ ను కోరాడు. గూగుల్లో క్యాబ్ కంపెనీకి ఫిర్యాదు చేస్తే రిఫండ్ వస్తుందని డ్రైవర్ చెప్పటంతో ఇంటికి వెళ్లిన డాక్టర్ గూగుల్ సెర్చ్ ను నమ్ముకున్నాడు.

గూగుల్ లో క్యాబ్స్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ అని కొట్టగా ఒక నెంబర్ డిస్ప్లై అయింది. ఆ నంబర్ కి ఫోన్ చేయగా తాము క్యాబ్ కంపెనీ సర్వీసెస్ అంటూ బాధితుడుని నమ్మించారు. తనకు రావాల్సిన 113 రూపాయల రీఫండ్ కోసం ప్రాసెస్ ఏంటి అని సైబర్ నెరగాడిని అడిగాడు. తాము ఒక అప్లికేషన్ ని పంపిస్తామని అది డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సైబర్ నేరగాడు బాధితుడికి సూచించాడు. రిమోట్ అప్లికేషన్ ద్వారా బాధితుడు తన బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేశాడు. సైబర్ నేరగాళ్లు అడిగిన ఓటీపీ చెప్తే చాలు మీ రిఫండ్ మీకు వస్తుందంటూ నమ్మించారు. వెంటనే వచ్చిన నాలుగు ఓటీపీలను సైబర్ నేరుగాళ్లకు బాధితుడు చెప్పేసాడు.. వెంటనే బాధితుడు ఖాతా నుండి 4.9 లక్షల రూపాయలు డెబిట్ అయిపోయాయి. తాను మోసపోయానని గ్రహించిన బాధిత డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గూగుల్ లో కస్టమర్ కేర్ నంబర్ ను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల ఫోన్ నెంబర్లతో సైబర్ నెరగాళ్లు గూగుల్ లో రిజిస్టర్ అయ్యారు. ఒకవేళ ఏదైనా సమస్యతో కస్టమర్ కేర్ తో మాట్లాడాలి అనుకుంటే సంబంధిత వెబ్ సైట్ కు వెళ్లి అక్కడ కనిపించే నంబర్ ను మాత్రమే సంప్రదించాలని సూచిస్తున్నారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ సి చేయండి..