Uda Devi: చరిత్ర చెప్పని పాఠం.. ఒంటిచేత్తో 32 మంది బ్రిటీష్ సైనికులను చంపిన దళిత వీరాంగిణి

భర్త చనిపోయిన తర్వాత తుపాకీ తీసుకుని సికందర్ బాగ్ చేరుకుంది. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో భారత సైనికులు ఇక్కడ ఉన్నారు. బ్రిటీష్ వారు సికందర్‌బాగ్‌పై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. బ్రిటీష్ వారికంటే ముందే ఉదా దేవి దాడి చేయడానికి సిద్ధమైంది. సికందర్‌బాగ్‌లో ఉన్న రావి చెట్టును ఎక్కింది. అప్పుడు ఆమె పురుషుడిమాదిరిగా దుస్తులు ధరించింది. 

Uda Devi: చరిత్ర చెప్పని పాఠం.. ఒంటిచేత్తో 32 మంది బ్రిటీష్ సైనికులను చంపిన దళిత వీరాంగిణి
Uda Devi
Follow us

|

Updated on: Nov 16, 2023 | 12:34 PM

బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి అనేకమంది పోరాడారు. బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తూ వీరమరణం పొందారు. అయితే ఎందరో స్వాతంత్ర్య వీరులు, వీర వనితల చరిత్ర మరుగున పడింది. అలాంటి వీరనారీమణిల్లో ఒకరు ఉదాదేవి. సాధారణ సైనికురాలు.. 150 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక్క రోజులో 32 మంది బ్రిటిష్ సైనికులను చంపి.. వారి చేతిలో వీరమరణం పొందిన వీరనారి..గురించి ఈ రోజు తెల్సుకుందాం..

1857 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న దళిత యోధురాలు. బేగం హజ్రత్ మహల్ రక్షణ కోసం చేసిన యుద్ధంలో ఉదా దేవి నాయకత్వం వహించింది. ఈ యుద్దాన్ని సికందర్ బాగ్ యుద్ధం అని పిలుస్తారు. నవంబర్ 16, 1857 న యుద్ధభూమిలో మరణించడానికి ముందు ఆమె ఒంటరిగా 32 మంది బ్రిటిష్ సైనికులను చంపింది. అనంతరం బ్రిటిష్ సైనికుల చేతిలో కన్నుమూశారు. అయితే ఆమె ధైర్యం ఇప్పటికీ చాలా మందికి ప్రేరణగా నిలిచింది.

లక్నోలోని చిన్‌హట్ ప్రాంతంలో బ్రిటీష్ సైన్యం , నవాబ్ సైన్యం మధ్య యుద్ధం జరిగింది. ఇందులో ఇరువైపులా పలువురు సైనికులు చనిపోయారు. బేగం హజ్రత్ మహల్ భద్రత కోసం మోహరించిన ఉదా దేవి భర్త మక్కా పాసి కూడా ఈ యుద్ధంలో వీరమరణం పొందాడు. తన భర్త మరణానికి ప్రతీకారంగా బ్రిటిష్ వారితో యుద్ధం చేయడానికి స్వయంగా సైన్యం నడిపే సారధ్యం తీసుకుంది. సాధారణ సైనికుడిగా  బ్రిటిష్ వారిపై ప్రతీకారంతో దాడి చేసి ఒక్క రోజులో 36 మంది బ్రిటిష్ వారిని చంపింది. పట్టపగలు బ్రిటిష్ సైన్యంపై దాడి చేసి ధైర్య శాలి ఉదా దేవి.

ఇవి కూడా చదవండి

భర్త చనిపోయిన తర్వాత తుపాకీ తీసుకుని సికందర్ బాగ్ చేరుకుంది. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో భారత సైనికులు ఇక్కడ ఉన్నారు. బ్రిటీష్ వారు సికందర్‌బాగ్‌పై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. బ్రిటీష్ వారికంటే ముందే ఉదా దేవి దాడి చేయడానికి సిద్ధమైంది. సికందర్‌బాగ్‌లో ఉన్న రావి చెట్టును ఎక్కింది. అప్పుడు ఆమె పురుషుడిమాదిరిగా దుస్తులు ధరించింది.

1857 నవంబర్ 16న రావి చెట్టు మీద కూర్చుని దాదాపు 36 మంది బ్రిటిష్ సైనికులపై దాడి చేసి చంపేసింది. దీంతో బ్రిటీష్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ దాడి ఎలా, ఎక్కడి నుంచి జరిగిందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. కోపంతో ఉన్న బ్రిటిష్ వారు సికందర్ బాగ్‌లో ఆశ్రయం పొందుతున్న భారతీయ యోధులపై దాడి చేసి భారీ సంఖ్యలో ఊచకోత కోశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కెప్టెన్ వియోలాస్ ,  డౌసన్ లకు తమ సైనికులు ఎలా చనిపోయారో అర్థం కాలేదు.  చుట్టూ పరిశీలిస్తున్న ఒక సైనికుడికి రావి చెట్టుమీద కూర్చుని తుపాకీతో కాల్పులు జరుగుతున్న వ్యక్తి కనిపించాడు. 36 మంది బ్రిటిష్ సైనికులు ఎలా చనిపోయారో అర్ధమై.. కోపంతో ఆ సైనికుడు ఉదా దేవిపై దాడి చేశాడు. బులెట్  తగిలి చెట్టుమీద నుంచి కింద పడిన ఉదా దేవిని చూసి బ్రిటిష్ సైనికులు షాక్ తిన్నారు. ఎందుకంటే అప్పటి వరకూ పురుషుడు అనుకుంటున్నవారికి తమపై ప్రతీకారం తీసుకుంది ఒక స్త్రీ అని తెలిసింది.

అప్పటి నుండి వీర వనిత ఉదా దేవి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు సమర్పించిన వీరవనితగా,  సైనికురాలిగా స్మరించుకుంటున్నారు. నేటికీ లక్నోలో ఉదా దేవి ఎంతో గౌరవ ఇస్తారు. అంతేకాదు సికందర్‌బాగ్ కూడలిలో ఉదా దేవి విగ్రహం ఏర్పాటు చేశారు.  ప్రతి సంవత్సరం ఉదా జయంతి,  వర్ధంతిల సందర్భంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఘనంగా నివాళులర్పిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం