AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: వ్యవసాయ వ్యర్ధాలతో తక్కువ ధరకే 4 వారాల్లో ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం.. యువతి సరికొత్త ఆలోచనలతో సక్సెస్..

పర్యావరణ అనుకూల సాంకేతికతతో శృతి చేపట్టిన ఇల్లు నిర్మాణం జరుగుతుంది. అంతేకాదు కేవలం నాలుగు వారాల్లో ఇల్లు సిద్ధం అవుతుంది. అంతేకాదు తక్కువ ఖర్చుతో ప్రజలకు ఇళ్లు సిద్ధం చేసి ఇవ్వడమే తన లక్ష్యం అని శృతి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Success Story: వ్యవసాయ వ్యర్ధాలతో తక్కువ ధరకే 4 వారాల్లో ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం.. యువతి సరికొత్త ఆలోచనలతో సక్సెస్..
Unique Business Idea
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2023 | 12:10 PM

సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు.  అయితే సొంత ఇల్లు అనేది కొందరికి మాత్రమే తీరే కల. ఈ కల ప్రతి ఒక్కరికీ ఇల్లు కావాలనే అవసరాన్ని గ్రహించిన ఓ యువతి సరికొత్త ఆలోచన చేసింది. ఒక స్టార్టప్‌కు పునాది వేసి.. సరసమైన ధరకే ఇల్లుని నిర్మిస్తోంది కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌ లో గ్రాడ్యుయేట్ అయిన శృతి. వాస్తవానికి అమెరికా నుంచి కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది శృతి. కొన్ని రోజులు న్యూయార్క్‌లోని ఒక సంస్థలో పనిచేసింది. ప్యాకేజీ బాగానే ఉంది.. అయితే తాను అందరిలా ఉద్యోగం చేస్తూ జీవించాలని అనుకోలేదు.

దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది.. కానీ వ్యాపార ఆలోచన రాలేదు. దీంతో శృతి భారతదేశానికి తిరిగి వచ్చింది. అప్పుడు SBI యూత్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద గ్రామాల్లో పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడే శృతి తలరాత మార్చే ఆలోచన వచ్చింది. శృతికి వచ్చిన ఆలోచనలతో విధిని మార్చింది.

ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. 

ఇవి కూడా చదవండి

ఎస్‌బీఐ యూత్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో గ్రామాల్లో పని చేస్తున్నప్పుడు.. శృతికి ప్రతి ఒక్కరికీ ఇల్లు అవసరమని గ్రహించింది. అందుకనే సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా ఇళ్లను నిర్మించడానికి స్టార్టప్‌ను ప్రారంభించింది. అయితే తన ఆలోచనను ఆచరణలో పెట్టాలనే సమస్య మొదలైంది. చివరకు దేశంలోని ఏ పెద్ద నగరాన్ని ఎంచుకోకుండా తన సొంత ఎకో స్టార్టప్‌ను ప్రారంభించింది. శృతి తన బృందంతో కలిసి ఉక్కు ఇళ్ల నిర్మించడం ప్రారంభించింది. ఈ ఇళ్ల నిర్మాణంలో శృతి గడ్డితో తయారు చేసిన కంప్రెస్డ్ ఎంజీ ఫైబర్‌ను ఉపయోగించింది. అంతేకాదు శృతి కంపెనీ పేరు కూడా స్ట్రక్చర్ ఎకో.

4 వారాల్లో సిద్ధం అయ్యే ఎకో ఫ్రెండ్లీ ఇల్లు 

పర్యావరణ అనుకూల సాంకేతికతతో శృతి చేపట్టిన ఇల్లు నిర్మాణం జరుగుతుంది. అంతేకాదు కేవలం నాలుగు వారాల్లో ఇల్లు సిద్ధం అవుతుంది. అంతేకాదు తక్కువ ఖర్చుతో ప్రజలకు ఇళ్లు సిద్ధం చేసి ఇవ్వడమే తన లక్ష్యం అని శృతి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. విశేషమేమిటంటే శృతి చేస్తున్న ఇళ్ల నిర్మాణం కోసం పంట అవశేషాలతో తయారుచేసిన ఇటుకలను ఉపయోగిస్తుంది. దీని వలన పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. శృతికి  చెందిన ఈ సంస్థ యూరోపియన్ కంపెనీతో కూడా ప్రత్యేక ఒప్పందం చేసుకుంది.

రైతుల స్థితిగతులను మెరుగుపరచడమే శృతి లక్ష్యం

తాను మొదలు పెట్టిన స్టార్టప్‌తో ప్రజల స్థితిగతులను మార్చాలని శృతి కోరుకుంటోంది. అందుకనే ఎక్కువ మంది రైతులు తన ప్రాజెక్ట్‌లో చేరాలని కోరుకుంటోంది. ఈ ప్రత్యేకమైన స్టార్టప్ తో శృతి UN ఇచ్చిన యూత్ అసెంబ్లీ అవార్డుతో సహా అనేక అవార్డులను కూడా అందుకుంది. అంతేకాదు శృతి యుపిలో అనేక అవార్డులను కూడా గెలుచుకుంది.. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఐఐఎం బెంగళూరులో అవార్డులను కూడా అందుకుంది.

కోవిడ్‌ సమయంలో ఆసుపత్రుల నిర్మాణం..

కోవిడ్ కాలంలో ఆసుపత్రిని నిర్మించడంలో శృతి కూడా సహాయం చేసింది. పాట్నాలో కేవలం 80 రోజుల్లోనే ఆసుపత్రిని నిర్మించింది. ఈ ఆసుపత్రి నిర్మాణ సమయంలో శృతి బృందానికి గ్రామస్తులు కూడా మద్దతు ఇచ్చారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఫోర్బ్స్ అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్‌లో కూడా శృతి చోటు దక్కించుకుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..