Success Story: ఆవు పేడని అమ్మి డబ్బులు సంపాదిస్తున్న రైతు.. సేంద్రియ వ్యవసాయంలో రైతులకు శిక్షణ
ముని లాల్ మహతో ని స్థానికులు 'బయోలాజికల్ మ్యాన్' పేరుతో పిలుస్తున్నారు. స్వయంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే మునీలాల్ మహతో ఇతర రైతులకు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు వందలాది మంది రైతులకు శిక్షణ ఇచ్చాడు. మహతో 2013 నుంచి పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. దీంతో దిగుబడి పెరగడమే కాదు సంపాదన కూడా పెరిగింది.
తక్కువ సమయంలో ఎక్కువ పంట దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం అధికం అవుతుంది. దీంతో భూసారం బలహీనపడుతోంది. దీంతో పొలాలు బీడుగా మారుతున్నాయి. దీంతో మళ్ళీ పూర్వకాలం వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులకు మరోసారి డిమాండ్ పెరిగింది. సేంద్రియ ఎరువుల కోసం అన్నదాతలు పెద్దఎత్తున వెచ్చిస్తున్నప్పటికీ రైతులకు సకాలంలో సేంద్రియ ఎరువులు అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు బెగుసరాయ్‌కు చెందిన ముని లాల్ మహతో దైవంలా కనిపిస్తున్నాడు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు సరసమైన ధరలకు సేంద్రీయ ఎరువులు అందజేస్తున్నాడు. మునిలాల్ కు రైతుల నుంచి ముందుగానే సేంద్రియ ఎరువుల కోసం ఆర్డర్లు అందుతాయి.
న్యూస్ 18 హిందీ నివేదిక ప్రకారం.. ముని లాల్ మహతో ని స్థానికులు ‘బయోలాజికల్ మ్యాన్’ పేరుతో పిలుస్తున్నారు. స్వయంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే మునీలాల్ మహతో ఇతర రైతులకు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు వందలాది మంది రైతులకు శిక్షణ ఇచ్చాడు. మహతో 2013 నుంచి పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. దీంతో దిగుబడి పెరగడమే కాదు సంపాదన కూడా పెరిగింది.
సేంద్రీయ పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు మంచి రేట్లు
మరోవైపు జిల్లాలోని చెరియా బరియార్‌పూర్ బ్లాక్‌కు చెందిన గోపాల్‌పూర్ పంచాయతీకి చెందిన రైతు ప్రమోద్ మహతో మాట్లాడుతూ.. తాను ముని లాల్ ను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా సేంద్రియ వ్యవసాయం ప్రారంభించానని చెప్పారు. ఇప్పుడు ఆదాయం కూడా పెరిగింది. వర్మీ కంపోస్టు తయారీతో పాటు ఫ్లై కంపోస్టును కూడా తయారు చేస్తున్నట్టు ప్రమోద్ మహతో తెలిపారు. ప్రమోద్ మహతో నమ్మితే, సేంద్రీయ పద్ధతిలో ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి రేటు లభిస్తుంది. దీంతో రైతులు క్రమంగా సేంద్రియ వ్యవసాయం వైపు ఆకర్షితులవుతున్నారు.
రసాయన ఎరువులకు సేంద్రీయ ఎరువుల ధరలకు మధ్య తేడా
ప్రస్తుతం మార్కెట్‌లో రసాయన ఎరువులు కిలో రూ.40కి విక్రయిస్తున్నారని, సేంద్రియ ఎరువులు కిలో రూ.6 మాత్రమేనని మునీలాల్ మహతో తెలిపారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల పంటలకు 6 సార్లు సాగునీరు అవసరం అయితే.. మరోవైపు, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు 3 సార్లు మాత్రమే నీరు అవసరం అవుతుందని పేర్కొన్నారు.
సేంద్రియ ఎరువుల ద్వారా ఏడాదికి అధిక మొత్తంలో ఆదాయం
ప్రస్తుతం మునీలాల్‌కు రెండు ఆవులు ఉన్నాయి. ఈ ఆవుల పేడతో సేంద్రియ ఎరువులను తయారు చేస్తాడు. తనకున్న 2 ఎకరాల భూమిలో కేవలం సేంద్రియ ఎరువు మాత్రమే వాడుతున్నాడు. దీంతో పాటు సేంద్రీయ ఎరువులను తయారు చేసి అమ్ముతూ ఏడాదికి 60 వేల రూపాయల ఆదాయం పొందుతున్నారు. అంతేకాదు మునీలాల్ పంటలకు ఆవు మూత్రాన్ని పురుగుల మందుగా వాడుతున్నాడు. దీంతో పంటలు అధిక మొత్తంలో దిగుబడినిస్తున్నాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..