Success Story: బంతి పువ్వుల సాగుతో జీవితాన్ని మార్చుకున్న రైతు.. లక్షల్లో సంపాదిస్తూ పదిమందికి ఆదర్శం..

పువ్వులు ఎక్కడ నుంచి వస్తున్నాయి... ఎంతకు కొంటున్నారు.. తిరిగి ఎంత ధరకు అమ్ముతున్నారు.. అన్న విషయాలపై దృష్టి పెట్టిన మనోజ్.. అన్ని రకాల విషయాలను తెలుసుకున్నాడు. దీంతో పువ్వుల వ్యాపారం సరిగ్గా చేస్తే లాభాలు వస్తాయని గ్రహించాడు. అంతేకాదు తమ మార్కెట్‌లో పూల రేటు కూడా ఎప్పుడూ బాగుంటుందని అదే పండగలు, ఫంక్షన్లు వస్తే ఆ ధర మరింత అధికంగా ఉంటుందని గ్రహించాడు.

Success Story: బంతి పువ్వుల సాగుతో జీవితాన్ని మార్చుకున్న రైతు.. లక్షల్లో సంపాదిస్తూ పదిమందికి ఆదర్శం..
Marigold Farming
Follow us
Surya Kala

|

Updated on: May 31, 2023 | 9:07 AM

వరి, గోధుమలు, మొక్కజొన్న, చెరకు, ఆవాలు వంటి పంటలను పండించడం ద్వారా మాత్రమే సంపాదించవచ్చని రైతులు అనుకుంటారు. అయితే సాంప్రదాయ పంటలు మాత్రమే కాదు.. డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని.. అన్నదాత విభిన్న పద్దతిలో సేద్యం చేయాలనుకుంటే వ్యవసాయం దండగ కాదు పండగ అనుకునేలా లాభాలను పొందవచ్చు. ఈ విషయాన్నీ కొందరు రైతులు అనుసరిస్తూ.. లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. బీహార్ రైతులు ఇప్పుడు ఆధునిక పద్ధతిలో హార్టికల్చర్ పంటల సాగు చేస్తున్నారు. దీంతో రైతుల ఆదాయం పెరగడమే కాకుండా దిగుబడి కూడా పెరిగింది. ప్రస్తుతం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించి లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ రైతుల్లో మనోజ్ కుమార్ కుష్వాహా ఒకరు. తూర్పు చంపారన్ జిల్లాలోని దేకహాన్ నివాసి. బంతి పువ్వులను సాగు చేస్తూ తన తోటి రైతులకు  ఆదర్శంగా నిలిచాడు.

న్యూస్ 18 కథనం ప్రకారం.. మనోజ్ కుమార్ కుష్వాహ రెండు ఎకరాల్లో బంతి పువ్వులను సాగు చేస్తూనే.. మరోవైపు కూరగాయలు కూడా పండిస్తున్నాడు. ఇప్పుడు నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.

ఇదే విషయంపై రైతు మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. తాను వ్యవసాయం చేసే భూమి ముంపునకు గురయ్యే భూమి అని చెప్పారు. వర్షాకాలంలో ఈ పొలాలు సుమారు 6 అడుగుల వరకూ నీటిలో మునిగిపోతాయి.ఒకొక్కప్పుడు నీటి ఎద్దడి కూడా ఏర్పడుతుంది. దీంతో అప్పట్లో ఈ భూములు వ్యవసాయ యోగ్యం కావు. దీంతో మనోజ్ తన భూములకు అనుకూలంగా ఉండే బంతి పువ్వుల సాగునీ ఎంచుకున్నాడు.   ఏటా ఒక్కో సీజన్‌లో బంతిపూలు, ఒక కూరగాయలు పండిస్తున్నాడు.

కలకత్తా నుంచి బంతిపూల మొక్కలు తెచ్చుకుని పూల సాగు ప్రారంభించారు.

మనోజ్ కుమార్ కుష్వాహ మాట్లాడుతూ.. పూల సాగుని చేపట్టక ముందు స్థానిక మార్కెట్‌కు వెళ్లినప్పుడు పూలు కొనడం, అమ్మడం చూసేవాడిని. మార్కెట్‌కి బయటి నుంచి పూలు వచ్చేవి. అప్పుడు పువ్వులు ఎక్కడ నుంచి వస్తున్నాయి… ఎంతకు కొంటున్నారు.. తిరిగి ఎంత ధరకు అమ్ముతున్నారు.. అన్న విషయాలపై దృష్టి పెట్టిన మనోజ్.. అన్ని రకాల విషయాలను తెలుసుకున్నాడు. దీంతో పువ్వుల వ్యాపారం సరిగ్గా చేస్తే లాభాలు వస్తాయని గ్రహించాడు. అంతేకాదు తమ మార్కెట్‌లో పూల రేటు కూడా ఎప్పుడూ బాగుంటుందని అదే పండగలు, ఫంక్షన్లు వస్తే ఆ ధర మరింత అధికంగా ఉంటుందని గ్రహించాడు. దీంతో పువ్వుల సాగునీ చేయాలని భావించాడు. వెంటనే మనోజ్ కలకత్తా నుంచి బంతిపూల మొక్కలు తెచ్చుకుని పూల సాగు మొదలుపెట్టాడు.

60 రోజుల తర్వాత బంతిపువ్వులు 

బంతి మొక్కలను నాటిన 60 రోజుల తర్వాత బంతి పువ్వులు పూయడం ప్రారంభమవుతుందని మనోజ్ తెలిపారు. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి పువ్వులు కోతకు వస్తాయి. మార్కెట్ లో ఒక కట్ట బంతి పూలు రూ.10వేలు. ఇలా 2 ఎకరాల పొలంలో బంతి పువ్వులను సాగు చేస్తూ ఏటా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. మొత్తం సీజన్‌లో తన పొలంలో 20 మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారని మనోజ్ చెప్పారు. అయితే ఇతర పంటల మాదిరిగానే బంతి పువ్వులకు కూడా వ్యాధి సోకే అవకాశం ఉందని మనోజ్ కుమార్ కుష్వాహ తెలిపారు. అందుకే చెడిపోయిన పూలు తెంపేసి వేస్తూ ఉండాలని.. అంతేకాదు నల్ల మచ్చలు రాకుండా పువ్వులు పూసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాడు. అంతేకాదు మరోవైపు ఖాళీ ఉన్న భూమిలో కూరగాయలను పెంచుతున్నాడు. ఈ కూరగాయలు ఇంటి ఖర్చులను కవర్ చేస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు